YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాపు కాసేశారు...

కాపు కాసేశారు...

కాపు కాసేశారు...
కాకినాడ, జూన్ 29
కాపుల రిజర్వేషన్ అంశం నా చేతుల్లో లేదు. నేను ఇస్తానని చెప్పి చంద్రబాబు లా మోసం చేయలేను. ఇది కాపుల అడ్డాగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట వద్ద పాదయాత్రలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు వైఎస్ జగన్. ఈ ప్రకటన చేసిన సమయం లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు జగన్. దాంతో వైసిపి లోని కాపు నేతలు అంతా ఉలిక్కి పడి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటన పార్టీకి డ్యామేజ్ తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కానీ జగన్ వెనక్కి తగ్గలేదు కానీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. రిజర్వేషన్ లు 50 శాతానికి మించి ఇవ్వాలంటే పార్లమెంట్ ఉభయసభల్లో నిర్ణయం జరగాలని కనుక తన చేతుల్లో లేదని తేల్చేశారుతాజాగా జగన్ సర్కార్ అర్హులైన కాపు మహిళలకు నేరుగా 15 వేలరూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అంతే దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిపోయారు. కాపు రిజర్వేషన్ల అంశం పక్కదారి పట్టించేందుకే వైసిపి ఈ తాయిలాలు ఇస్తుందని అడిగింది ఇవ్వకుండా ఇవి ఇస్తే ఏమిటి అంటూ లేఖ సంధించి చర్చకు తెరలేపారు. అయితే ఎన్నికల ముందు కానీ, అంతకుముందు ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమ సమయంలో తన స్పష్టమైన వైఖరిని జనసేన స్పష్టం చేయలేదు. ఎన్నికల సమయంలో మాత్రం బిసి లకు ఇబ్బంది లేకుండా కాపు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ క్లారిటీ ఇవ్వలిసి వచ్చింది ఆ పార్టీ కివాస్తవానికి కోస్తా లో కాపు యువత అంతా పవన్ కల్యాణ్ చరిష్మా కు ఆకర్షితులై ఆయన వెంట నడిచారు. అయితే దీనిని తమ పార్టీకి అనుకూలం గా మార్చుకోవడంలో జనసేన వెనుకాడింది. అందరి వాడుగా ఉంటే కానీ ఎన్నికల్లో గట్టెక్కమని భావించి పవన్ కల్యాణ్ కుల ముద్ర కు ఇష్టపడలేదు. ఇప్పటికి అదే స్టాండ్ మీద ఆయన ఉన్నారు. అయితే ఇప్పుడు వైసిపి కాపు ఓటు బ్యాంక్ ను కూడా తమ వైపుకు తిప్పుకుంటున్న ప్రయత్నాలను గ్రహించిన జనసేనాని రిజర్వేషన్ల అంశం ఎత్తక తప్పని పరిస్థితి ని జగన్ కల్పించారు. వైసిపి జనసేన నుంచి కోరుకుంటున్నది ఇదే అంటున్నారు ఇప్పుడు విశ్లేషకులు.పవన్ కల్యాణ్ ముసుగు తొలగించి కాపుల తరపున గళం వినిపించేలా చేయాలని వైసిపి వ్యూహం ప్రకారం అడుగులు వేస్తుంది. ఆ వ్యూహానికి పవన్ కల్యాణ్ చిక్కి చర్చను రచ్చ అయ్యేలా చేస్తే తమకే లబ్ది అన్నది వైసిపి అంచనా. ఇప్పటికే జనసేనాని లేఖతో స్పందించడం తో దీనిపై మరింత వివాదాన్ని సృష్ట్టించేందుకు ఫ్యాన్ పార్టీ సిద్ధమౌతున్నట్లే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తో పొత్తు ఉన్న జనసేన పార్లమెంట్ లో 50 శాతానికి మించి రిజర్వేషన్ లు ఇచ్చేలా వత్తిడి తెస్తే బిసిలకు నష్టం లేకుండా పని జరుగుతుందన్న వాదన తేవడానికి అధికారపార్టీ రెడీ అయ్యింది.

Related Posts