YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఆఫీసు నుంచే వ్యవహారాలు

టీడీపీ ఆఫీసు నుంచే వ్యవహారాలు

టీడీపీ ఆఫీసు నుంచే వ్యవహారాలు
విజయవాడ, జూన్ 29,
ఒకప్పుడు చంద్రబాబుకు రెండు రాష్ట్రాల్లో పట్టు ఉండేది. అక్కడా, ఇక్కడా ఆధిపత్యం చెలాయించే వారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు రెండు రాష్ట్రాల్లో తన సత్తా చాటుకోవాలనుకున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడంలో భాగంగా ఓటుకు నోటు కేసు బయటకు రావడంతో కేసీఆర్ కు పూర్తిగా ప్రత్యర్థిగా మారారు. ఎంతగా అంటే చంద్రబాబుపై కసి తీర్చుకునే విషయంలో కేసీఆర్ శత్రువులతోనైనా చేతులు కలిపేంత విధంగా. అందుకే పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా అమరావతి అంటూ బెజవాడకు చంద్రబాబు మకాం మార్చేశారు.అమరావతిలో ఐదేళ్లు పాలన చేసిన తర్వాత గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏపీలోనూ చంద్రబాబు నిస్తేజంగా మారిపోయారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నాయి. చంద్రబాబు అమరావతి కంటే హైదరాబాద్ తనకు సేఫ్ అని భావిస్తూ వచ్చారు. అందుకే అంతర్గత సమావేశాలు, ముఖ్యమైన వారితో మీటింగ్ లు అన్నీ హైదరాబాద్ లోనే చంద్రబాబు ఏర్పాటు చేసుకుంటారు. శని, ఆదివారాల్లోనే ఈ మీటింగ్ లు ఎక్కువగా జరుగుతుంటాయి.జాతీయ మీడియా ప్రతినిధుల నుంచి తనకు నమ్మకమైన ఇతర పార్టీల నేతలు కూడా చంద్రబాబును హైదరాబాద్ లోనే కలుస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు పై కూడా తెలంగాణ ప్రభుత్వం నిఘా పెంచిందంటున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటివద్ద కూడా ఏపీ పోలీసుల భద్రత ఉంటుంది. ప్రతిపక్ష నేత కావడంతో పహారా కూడా ఉంటుంది. ఇక తాజాగా పార్క్ హయత్ హోటల్ లో బయపడిన ఉదంతం చంద్రబాబును ఉలిక్కి పడేలా చేసింది.హైదరాబాద్ కూడా తనకు సేఫ్ కాదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఒక ముఖ్యనేత ఆదివారం హైదరాబాద్ వచ్చి కలుస్తానని చెప్పినా వద్దని చెప్పడంపై పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఏపీ సీఐడీ, ఇంటలిజెన్స్ విభాగాలు ఎక్కువగా చంద్రబాబు కదలికలు, ఆయన ఇంటి రాకపోకలు చేసే వారిపై నిఘా పెట్టడంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. తనతో ఎవరూ హైదరాబాద్ లో కలవవద్దని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోనే కలవాలని చెబుతున్నారట. మొత్తం మీద చంద్రబాబుపై రెండు రాష్ట్రాల్లో నిఘా ఎక్కువవ్వడంతో టీడీపీ నేతల్లో ఆందోళన పెరిగింది

Related Posts