YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 స్ట్రాటజీ మారుస్తున్న కుమారస్వామి..

 స్ట్రాటజీ మారుస్తున్న కుమారస్వామి..

 స్ట్రాటజీ మారుస్తున్న కుమారస్వామి...
బెంగళూర్, జూన్ 29
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక టెన్షన్ తీరింది. తన తండ్రి రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన ఒకింత రిలీఫ్ ఫీలయ్యారు. తండ్రి దేవెగౌడ ఢిల్లీ రాజకీయాలకే పరిమితమవ్వాలని కుమారస్వామి భావిస్తున్నారు. రాష్ట్రా పార్టీలో ఇటీవల కాలంలో అసమ్మతి తలెత్తడానికి దేవెగౌడ నిర్ణయాలే కారణమనే వారు కూడా లేకపోలేదు. కుటుంబ పార్టీగా ముద్రపడటంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరస అపజయాలు ఎదురవుతున్నాయి. దీంతో స్ట్రాటజీ మార్చాలని కుమారస్వామి భావిస్తున్నారు.ప్రధానంగా సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో తాము పూర్తిగా వెనకబడి ఉన్నామని కుమారస్వామి గుర్తించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సయితం తాను సక్రమంగా వినియోగించుకోలేక పోయినందునే అనేక ఆరోపణలు వచ్చాయని కుమారస్వామి భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు జేడీఎస్ సోషల్ మీడియా వింగ్ పై కుమారస్వామి దృష్టిపెట్టినట్లు తెలిసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన విభాగంతో ఆయనభేటీ అయినట్లు చెబుతున్నారు.మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలను కుమారస్వామి తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ను తమ ఎన్నికల వ్యూహకర్తగా కుమారస్వామి నియమించుకున్నారు. అయితే కోవిడ్ కారణంగా ప్రశాంత్ కిషోర్ టీం రాలేకపోయింది. దీంతో ఆయనను ఫోన్ లో సంప్రదిస్తూ సోషల్ మీడియా వింగ్ ను పటిష్టం చేసే పనిలో కుమారస్వామి ఉన్నారని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కనీసం వంద నుంచి 150 స్థానాల్లో బలంగా ఉండాలన్నది కుమారస్వామి లక్ష్యంగా కనిపిస్తోంది.ఇందుకోసం నియోజకవర్గాలను కుమారస్వామి ఎంపిక చేశారని తెలిసింది. ఈ నియోజకవర్గాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువగా ఇక్కడే పర్యటించాలని కుమారస్వామి నిర్ణయించినట్లు చెబుతున్నారు. దేవెగౌడ ఎటూ రాజ్యసభకు వెళ్లడంతో ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చూసుకుంటారని, ఇక్కడ పార్టీని మాత్రం తానే ముందుండి నడపాలని కుమారస్వామి ప్లాన్ రెడీ చేసుకున్నట్లు చెబుతున్నారు. స్ట్రాటజీ మార్చి వెళితే వర్క్ అవుట్ అవుతుందేమోనన్నది కుమారస్వామి ఆశ. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts