YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 తేజస్వీకి పట్టు తప్పుతోందా

 తేజస్వీకి పట్టు తప్పుతోందా

 తేజస్వీకి పట్టు తప్పుతోందా
పాట్నా, జూన్ 29,
హార్ లో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటి నుంచే కప్పదాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది బీహార్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బీహార్ రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచే తమ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రారంభించాయి. వర్చువల్ మీటింగ్ లు నిర్వహిస్తున్నాయి. పొత్తులపై కూడా మాట్లాడు కుంటున్నాయి. ఈ పరిస్థితులలో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీకి గట్టి దెబ్బతగిలింది.వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ కూటమి విజయం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై అసంతృప్తితో పాటు ఆర్జేడీ కూటమిని వదిలేసి వెళ్లారన్న ఆగ్రహం ప్రజల్లో ఉందని అంటున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్నా ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ పార్టీని సమర్థవంతంగానే నడిపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆర్జేడీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడటం చర్చనీయాంశమైంది.తేజస్వి యాదవ్ పై నమ్మకం లేకనే ఎమ్మెల్సీలు జేడీయూలోకి వెళ్లారన్న వాదన ఉంది. గత కొంతకాలంగా లాలూప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వారసత్వం కోసం ఇద్దరు కుమారుల మధ్య అంతర్గతంగా వార్ నడుస్తుంది. తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ కూడా గత పార్లమెంటు ఎన్నికల సమయంలో పెట్టారు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ రానున్న ఎన్నికల నాటికి జైలు నుంచి రాలేరు. దీంతో పార్టీని నడపటం వీరివల్ల కాదని ఎక్కువ మంది ఆర్జేడీ నేతలు అభిప్రాయపడుతున్నారు.అందుకోసమే ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి జేడీయూలో జాయిన్ అయ్యారు. జులై 6న ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని జేడీయూ భావిస్తుంది. ఎమ్మెల్సీలు రావడంతో త్వరలోనే ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివరలో జరగనున్న ఎన్నికల్లో ఆర్జేడీ కూటమికి పెద్దగా కలసి రాదని భావించిన ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. ఇది పూర్తిగా లాలూ కుటుంబంలోని విభేదాల వల్లనే జరుగుతుందంటున్నారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్జేడీకి దెబ్బ మామూలుగా తగలలేదు.

Related Posts