YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆధునిక వైద్య పరికరాలతో జనం ముందుకు..

ఆధునిక వైద్య పరికరాలతో జనం ముందుకు..

ఆధునిక వైద్య పరికరాలతో జనం ముందుకు..
జూలై 1న కొత్త వాహనాలను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
అందుబాటులో వెంటిలేటర్, ఇన్‌ఫ్యూజన్‌ పంప్స్, సిరంజి పంప్స్‌
అమరావతి జూన్ 29 
రాష్ట్రంలో అంబులెన్స్‌ వ్యవస్థ మళ్లీ ప్రాణం పోసుకుంది. 2010 తర్వాత 108, 104 వ్యవస్థలు ఎలా నీరుగారి పోయాయో అందరికీ తెలిసిందే. లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్స్‌ వ్యవస్థను మళ్లీ బతికించాలన్న ఉద్దేశంతో సర్కారు నడుం బిగించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో కొత్త అంబులెన్స్‌లు రోడ్డెక్కనున్నాయి. వీటితో పాటు సంచార వైద్య శాలలుగా చెప్పుకునే 104 వాహనాలు పల్లెలకు సగర్వంగా తలెత్తుకుని వెళ్లనున్నాయి. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చే 108 వాహనాలతో పాటు పల్లె ప్రజలకు వైద్యం అందించడానికి మండలానికొక 104 వాహనం వెళ్లనుంది. జూలై 1న ఈ కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు, రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా చిన్నారుల కోసం నియోనేటల్‌ కేర్‌ అంబులెన్స్‌లు సైతం రోడ్డు మీదకు రానున్నాయి.
 ప్రత్యేకతలు
పల్సాక్సీమీటర్‌ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ అంటే.. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని చూడటంతో పాటు పల్స్‌ రేటు చూపిస్తాయి.మల్టీపారామానిటర్‌ ఈసీజీ స్థాయిని ఎప్పటికప్పుడు చూడటంతో పాటు ఉష్ణోగ్రతల స్థాయి, రక్తపోటు స్థాయిలను చూడొచ్చు.

Related Posts