YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ తో ఎస్ఒఎల్ వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు ఒప్పందం

స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ తో ఎస్ఒఎల్ వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు ఒప్పందం

స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ తో ఎస్ఒఎల్ వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు ఒప్పందం
హైదరాబాద్ జూన్ 29 
 అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ తో ఎస్ఒఎల్ వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరు సూక్ష్మ, చిన్న, మధ్యత రహా సంస్థలకు సంబంధించి బి2బి డిజిటల్ వేదిక అయిన ఎస్ఒఎల్ వి ప్రత్యేకించి ఎంఎస్ ఎంఇ విభాగం కోసం రూపొందించిన క్రెడిట్ కార్డ్ ను స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఆవిష్కరించింది. ఎస్ఒఎల్ వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు వ్యాపార సంస్థల యజమానులకు వారు తమ సరఫరాల చెల్లింపులు, ఇంధనం, లాజిస్టిక్స్, ముడిపదార్థాల కొనుగోలు, వివిధ సేవల చెల్లింపులు, ఇతర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వా డుకునే మొత్తాలను అందుబాటులో ఉంచుతుంది. అంతే గాకుండా ఎస్ఒఎల్ వి వేదిక పై అందించేబహుళ ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. చిన్న సంస్థలు ఒకదానితో ఒకటి వ్యాపారం చేసుకునేందు కు భారతదేశవ్యాప్తంగా తమ కస్టమర్ బేస్ పెంచుకునేందుకు తోడ్పడుతుంది.కోవిడ్ -19 మాంద్యం ఎంఎస్ఎంఈలకు నగదు రాకను ప్రభావితం చేసింది. ఎస్ఒఎల్ వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు సరైన సమయంలో వచ్చింది. చిన్న వ్యాపారాలకు స్వల్పకాలిక రివాల్వింగ్ క్రెడిట్ లభ్యతకు గాను కస్టమైజేషన్ కు వీలు కల్పిస్తుంది.  దేశంలో అగ్రగామి బహుళజాతి బ్యాంక్ దీనికి అండగా నిలుస్తోంది.ఎస్ఒఎల్ వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు పొందేందుకు ఏ విధమైన జాయినింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లే దు. అంతేగాకుండా క్యాష్ బ్యాక్ మరియు రివార్డ్ ఫీచర్లతో ఉంటుంది. ఎంఎస్ఎంఈ రం గం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ కార్డ్ ఇంధనం లావాదేవీలపై 5% క్యాష్ బ్యాక్ అందిస్తుంది. దీంతో ధరల పెరుగుదల తో వాటిల్లే భారాన్ని కాస్తంత తగ్గించుకోవచ్చు. ప్రతీ నెలా రూ.4000 ఇంధనంపై వెచ్చిస్తే రెండు లీటర్లకు పై గా పెట్రోలు ఉచితంగా పొందవచ్చు. అదనంగా సూక్ష్మ, చిన్న వ్యాపారాలు తమ డిజిటల్ విశ్వసనీయతను పెంచుకోవచ్చు. ప్రస్తుత వ్యాపార వాతావరణంలో ఓ సంస్థ విజయం సాధించాలంటే డిజిటల్ విశ్వసనీయత తప్పనిసరిగా మారింది.ఈ భాగస్వామ్యం గురించి స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ ఇండియా ఎండీ, అలియెన్సెస్, పార్ట్ నర్ షిప్స్ అండ్ మా ర్టిగేజెస్ హెడ్ జైనీశ్ షా మాట్లాడుతూ, ‘‘దేశానికి చోదక శక్తి ఎంఎస్ఎంఈలని మరియు భారతదేశ అభివృద్ధి తదుపరి తరంగంగా అవిఉంటాయని బ్యాంక్ దృఢంగా విశ్వసిస్తోంది. ఎంఎస్ఎంఇ తన పూర్తి స్థాయి శక్తి సా మర్థ్యాలను ప్రదర్శించడంలో ఎస్ఒఎల్ వి తో పాటుగా మేం కూడా కట్టుబడి ఉన్నాం. ఎంఎస్ఎంఈలను డి జిటల్ గా శక్తివంతం చేయడం, వాటి సవాళ్ళకు వినూత్న పరిష్కారాలను కనుగొనడం ఎస్ఒఎల్ వి ఆశ యంగా ఉంది. ఈ అనుబంధ క్రెడిట్ కార్డ్ ను ప్రవేశపెట్టడంతో అది మరింత ముందడుగు వేసినట్లయింది. ఈ ముఖ్యమైనకార్యక్రమంలో వారితో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.ఎస్ఒఎల్ వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ గురించి ఎస్ఒఎల్ వి సీఈఓ నితిన్ మిట్టల్ మాట్లాడుతూ, ‘‘ఎస్ఒఎల్ వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డ్ అనేది సవాళ్ళనుఎదుర్కోవడంలో ఎంఎస్ఎంఈలకు తోడ్పడడంలో మా మరో ముందడుగు. ఈ క్రెడిట్ కార్డ్ చిన్న వ్యాపార సంస్థల యజమానులకు ఎంతో తోడ్పడుతుంది. రోజువారీ వ్య యాలు, లాజిస్టిక్ వ్యయాలు లాంటి వాటిని చెల్లించేందుకు ప్రతిష్టాత్మక, విశ్వసనీయ భాగస్వామి నుంచి అం దుబాటు రేటుకే నిధులకు యాక్సెస్ పొందవచ్చు. దీర్ఘకాలంలో ఇది వారికి మరింత సాధికారికతను అందించనుంది. మరింత ద్రవ్యలభ్యతను అందుబాటులోకి తేనుంది’’ అని అన్నారు.

Related Posts