YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

వ్యాక్సిన్ తయారీలో ఎక్కడివరకు వచ్చారంటే?

వ్యాక్సిన్ తయారీలో ఎక్కడివరకు వచ్చారంటే?

వ్యాక్సిన్ తయారీలో ఎక్కడివరకు వచ్చారంటే?
న్యూ ఢిల్లీ జూన్ 29  
ప్రపంచానికి కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్నా మాయదారి మహమ్మారికి పీచమణిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధన సంస్థలు వ్యాక్సిన్ తయారీ కోసం పని చేస్తున్నాయి. దాదాపు 400ప్రయోగాలు జరుగుతుండగా వీటిల్లో పదమూడింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.ఈ పదమూడింటిలో ఏదో ఒకటి..మహమ్మారికి మందుగా మారుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.రాత్రి పగలు అన్న తేడా లేకుండా పని చేస్తున్న పరిశోధకులు.. వ్యాక్సిన్ తయారీలో ఎక్కడివరకు వచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం వరకు ఆక్స్ ఫర్డ్ యనివర్సిటీ - ఆస్త్రా జెనెకా కంపెనీ కలిసితయారు చేస్తున్న వ్యాక్సిన్ అందరి కంటే ముందురిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే మీడియా మొఘల్ రామోజీ వియ్యంకుడి కంపెనీ కీలకం కానుంది. ఎందుకంటే.. ఆ సంస్థతో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుందన్నది మర్చిపోకూడదు.ఆక్స్ ఫర్డ్ వర్సిటీతోపాటు.. మోడెర్నా ఇన్ కార్పొరేషన్ కూడా పోటీలో ముందు ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే నెల (జులై) ఈ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి మూడో దశ ప్రయోగాలు మొదలు కానున్నాయి. ఈ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వస్తే.. వ్యాక్సిన్ తయారీకి వెంటనే అనుమతులు లభించే వీలుందని చెబుతున్నారు. ఇక.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పేరును ప్రస్తుతం ఎజెడ్ డీ 1222 గా మార్చారు. గతంలో ఉన్న పేరు పలకటం కష్టంగా ఉండటంతో దీని పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వీరు రూపొందించిన వ్యాక్సిన్  థర్డ్ ట్రయల్స్ లో ఉంది. తాజాగా బ్రెజిల్ ప్రభుత్వంతో కుదిరిన డీల్ లో ఈ వ్యాక్సిన్ ప్రపంచం మొత్తంగా పది చోట్ల తయారీ జరుగుతుందని చెబుతున్నారు.అమెరికాకు చెందిన మోడెర్నా తయారు చేస్తున్న వ్యాక్సిన్ రెండో దశలో ఉంది. ఇది కూడా అక్టోబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఒకేసారి పది కోట్ల డోసుల్ని తయారు చేయనున్నారు. ఇక.. ఫ్రాన్స్ కు చెందిన అతి పెద్ద ఫార్మా కంపెనీ సినోఫీ. జీఎస్ కేతో కలిసి వ్యాక్సిన్ తయారుచేసింది. ఇప్పటికే రెండుట్రయల్స్ పూర్తి చేశారు. కాస్త ఆలస్యంగా అయినా.. వైరస్ కుసమూలంగా చెక్ పెట్టే వ్యాక్సిన్ తమదేనని చెబుతున్నారు. డిసెంబరు నాటికి 10 కోట్ల డోసులు తయారుచేయటమే ఈ సంస్థ లక్ష్యం. థాయ్ కు చెందిన ఒక సంస్థ కూడా వ్యాక్సిన్ తయారు చేస్తోంది. తాము రూపొందించిన వ్యాక్సిన్ కోతులకు ఇవ్వగా.. బోలెడన్ని యాంటీ బాడీస్ ఉత్పత్తి కావటంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా  చూస్తే.. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలన్ని మధ్యలో చాలా కీలక దశలో ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది. ఏమైనా అక్టోబరు నాటికి వ్యాక్సిన్ వచ్చే వీలుంది. లేకుంటే.. డిసెంబరుకు పక్కా అని చెప్పక తప్పదు. అప్పటివరకూ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఎవరి మీద వారికే ఉందన్నది మర్చిపోకూడదు.

Related Posts