ఎంఎస్ఎంఈ బకాయిల విడుదల
అమరావతి జూన్ 29
ఎంఎస్ఎంఈ సెక్టార్లో దాదాపు 98వేల యూనిట్ల ద్వారా దాదాపు రూ.10లక్షల మందికి లబ్ధి చేకూరిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండో విడత రీస్టార్ట్ ప్యాకేజీ నిధులను అయన సోమవారం విడుదల చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మే నెలలో మొదటి విడతగా రూ.450 కోట్లు విడుదల చేశాం. ఇచ్చిన తేదీ ప్రకారం ఇవాళ మళ్లీ రూ.512 కోట్లు రెండో దఫా విడుదల చేస్తున్నాం. చిన్న చిన్న పరిశ్రమలకు తోడుగా ఉంటేనే వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలుగుతారు. వ్యవసాయరంగం తర్వాత ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ఎంఈలదేనని అయనఅన్నారు. 2014 నుంచి గత ప్రభుత్వ హయాంనుంచి మనం అధికారంలోకి వచ్చేంతవరకూ ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక బకాయిలు దాదాపుగా రూ.800 కోట్లు. మరి వాళ్లు ఏరకంగా నిలదొక్కుకుంటారు. అందుకనే వారికివ్వాల్సిన బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేశాం. కోవిడ్ వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో వీరికి వెసులుబాటు ఇచ్చేందుకు ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో కరెంటు ఫిక్స్డ్ ఛార్జీలు రూ.180 కోట్లు మాఫీచేశాం. రూ.2 లక్షలనుంచి రూ.10 లక్షల వరకూ వర్కింగ్ కేపిటల్ కోసం తక్కువ వడ్డీతో కేవలం రూ.6–8శాతంతో ఇస్తున్నామని సీఎం వెల్లడించారు