YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలి

రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలి

రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలి
 ఇల్లందు జూన్ 29  
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని ఏ ఐ కే ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏపూరి బ్రహ్మం డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ ను ఉపసంహరణ చేసుకోవాలని, ఈ ఆర్డినెన్స్ తో నిత్యావసర చట్ట సవరణ తో నిత్యావసర వస్తువుల నుంచి ఉల్లిపాయలు, పప్పు దినుసులు తొలగించడం జరుగుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా రైతు సంఘం పిలుపు మేరకు మండల వారీగా తహశీల్దార్ కు ఏ ఐ కే ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు, నిల్వ, రవాణా బహుళ జాతి సంస్థలకు అప్పగించడంతో వ్యవసాయ రంగంలో ప్రేవేట్ పెట్టుబడి దారులకు కట్ట బెట్టడం రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఇది వ్యవసాయ రంగం ప్రేవేటీకరణ చేయడంతో రైతులకు భవిష్యత్ తరాలకు నష్టం వాటిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ జిల్లా నాయకులు దేవరకొండ శంకర్, పట్టణ, మండల కార్యదర్సులు బంధం నాగయ్య, ఉ డ త ఐలయ్య, కౌన్సిలర్ కుమ్మరి రవీందర్,  నాయకులు భాస్కరరావు, సంశుద్ధీన్,  వడ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related Posts