YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ఆర్ నవోదయం" ద్వారా.. పరిశ్రమలకు కొత్త ఊపిరి

వైఎస్ఆర్ నవోదయం" ద్వారా.. పరిశ్రమలకు కొత్త ఊపిరి

వైఎస్ఆర్ నవోదయం" ద్వారా.. పరిశ్రమలకు కొత్త ఊపిరి
- జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్
 రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా.. జిల్లాలోని  502 ఎం.ఎస్.ఎం.ఈ. యూనిట్లకు రూ.28.83 కోట్లు
కడప జూన్ 29  
వైఎస్ఆర్ నవోదయం", రీ స్టార్ట్ ప్యాకేజీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోస్తోందని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫిరెన్సు ద్వారా.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు  రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రెండో విడత రాయితీ బకాయిలను ఎంఎస్ఎంఈల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుండి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జేసీ (ఆసరా, సంక్షేమం) శివారెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజోలి వీరారెడ్డి హాజరయ్యారు.  ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం జిల్లాకు చెందిన 502 ఎంఎస్ఎంఈ యూనిట్లకు రెండవ విడత రి స్టార్ట్ ప్యాకేజి కింద విడుదలయిన రూ.28,83,00,000 ల మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జేసీ శివారెడ్డి, పారిశ్రామిక వేత్త రాజోలి వీరారెడ్డిలు లబ్దిదారులకు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యాన్ని పెంచి, అటు పారిశ్రామిక, ఇటు సర్వీసు రంగాల్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలను అపారంగా అందిస్తోందన్నారు. ఇప్పటికే పలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా వేలాది మంది లబ్ధి పొందుతూ పలువురికి ఉపాధిని కూడా కల్పిస్తోందన్నారు. పారిశ్రామిక, సేవా రంగాలు మన రాష్ట్ర ఆర్ధిక ప్రగతి రథానికి.. రెండు చక్రాలగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పారిశ్రామిక రంగానికి మరింత ప్రాముఖ్యం ఇచ్చి... ఆర్ధికంగా చేయూతనిస్తున్నారన్నారు.

Related Posts