YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కరోనా నుంచి బయట పడేందుకు కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 1.0 ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. 

కరోనా నుంచి బయట పడేందుకు కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 1.0 ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. 

కరోనా నుంచి బయట పడేందుకు కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 1.0 ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. 
ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ అన్‌లాక్ 2 విధివిధానాలను ప్రకటించింది. 
కంటైన్మెంట్ జోన్ లలో జూలై 31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.  
ఇదివరకటిలాగే సినిమా హాల్స్, జిమ్స్, స్కూల్స్, కాలేజ్ లు జూలై 31 వరకూ మూసివేసి ఉంటాయని ప్రకటిచింది.
*అన్ లాక్-2లోని ముఖ్యాంశాలు*
* కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం
* హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం
* మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌పై కొనసాగుతున్న నిషేధం
* సామాజిక, రాజకీయ, మత పరమైన కార్యకలాపాలకు నిషేధం కొనసాగింపు
* ఇదివరకటిలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. 
* నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగింపు
*కంటైన్మెంట్ జోన్ లలో జూలై 31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
* బయట తిరిగే వారు ముఖమంతా మాస్కు కప్పుకుని ఉండాల్సిందేనన్న కేంద్రం
* ప్రయాణ సమయం మొత్తం ప్రయాణికులు మాస్క్‌ ధరించి ఉండాల్సిందేనన్న కేంద్రం
* ప్రతి ప్రదేశంలో 6 అడుగుల దూరాన్ని పాటించాలన్న కేంద్రం
* దుకాణాలన్నీ కేంద్రం మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేయాలన్న కేంద్రం
* ఎక్కువ సంఖ్యలో గుమిగూడటంపై నిషేధం కొనసాగింపు
* వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదు
* అంత్యక్రియల్లో 20 మందికి మాత్రమే అనుమతి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు
* బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం
* అవకాశం మేరకు ఇంటి నుంచి పని చేసేందుకే ప్రయాత్నించాలి
*SURVIVE FIRST* !!! 
*REVIVE NEXT* !!! 
+++++++++++++++++++++++
*డాక్టర్ అర్జా శ్రీకాంత్* 
స్టేట్ నోడల్ ఆఫీసర్ Covid19

Related Posts