YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

చైనా యాప్స్ పై నిషేధం

చైనా యాప్స్ పై నిషేధం

చైనా యాప్స్ పై నిషేధం
న్యూఢిల్లీ, జూన్ 30
సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 సంస్థలకు చెందిన యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సహా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో టిక్‌టాక్‌‌తో పాటు షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీ చాట్‌, బ్యూటీ ప్లస్‌ తదితర కీలక యాప్‌లు ఉన్నాయి.చైనీస్‌ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే కొంతకాలంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధం విధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌ వినిపిస్తోంది. గల్వాన్ లోయలో ఘర్షణలకు కారణమై 20 మంది జవాన్లు అమరులవడానికి కారణమైన చానా వస్తువున్నింటినీ బహిష్కరించాలని దేశవాసులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించకుంది.

Related Posts