సింహాచలంశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో తొలివిడత చందనం అరగదీత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారికి సమర్పించే చందనాన్ని ముందుగా స్వామి అంతరాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి చందనం అరగదీతను ప్రారంభించారు. తొలి చందనపు చెక్కను ఆలయ ఇంచార్జి ప్రధానార్చకులు గోపాలకృష్ణమాచార్యులు చందనాన్ని అరగదీశారు. ఈ ఉత్సవంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు . అనంతరం చందనాన్ని అరగదీసారు. ఈ చందనం అరగదీత కార్యక్రమం మూడు రోజులపాటు మూడు మణుగు (125 కిలో) ల చందనాన్ని అరగదీస్తారు . ఈ నెల18 న జరిగే నిజరూప దర్శనం అనంతరం చందనాన్ని స్వామివారికి సమర్పించనున్నారు . మంత్రి గంటా మాట్లాడుతూ చందనోత్సవానికి సామాన్య భక్తునికే పెద్దపీటవేశామని , వీవీఐపీ లకు కేటయించిన సమయాల్లోనే వారిని దర్శించుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్నిఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.