YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

సీబీఎస్ఈ సిలబస్ 33 శాతం తగ్గింపు..

సీబీఎస్ఈ సిలబస్ 33 శాతం తగ్గింపు..

సీబీఎస్ఈ సిలబస్ 33 శాతం తగ్గింపు..
న్యూఢిల్లీ, జూన్ 30,
దేశంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా వైరస్ వ్యవస్థల్ని నిర్వీర్తం చేస్తోంది. కేసులు పెరుగుతుండడంతో ఈఏడాది విద్యాసంవత్సరం బాగా ఎఫెక్ట్ అవుతోంది. ఇప్పటికే ఎంట్రన్స్ పరీక్షలు పూర్తికావలపి వున్నా అవి వాయిదా పడ్డాయి. విద్యారంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవుతున్న క్రమంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా అత్యవసర జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించిన సీబీఎస్ఈ  అధికారులు పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగానే  కొత్త విద్యా సంవత్సరం ఆగస్టులో ప్రారంభం కానుంది. అందులో భాగంగా సీబీఎస్ఇ ఈ ఏడాది 33 శాతం సిలబస్‌ను తగ్గించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. 1వ తరగతి నుంచి 8 తరగతి వరకు పాఠశాలలే సిలబస్‌ను తగ్గించనున్నారు.అనంతరం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తగ్గించిన సిలబస్‌కు సంబంధించిన సర్క్యూలర్లను త్వరలోనే విడుదల చేయనుంది. అటు క్వశ్చన్ పేపర్‌లో కూడా 50 శాతం మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలను ఇవ్వాలని, మిగిలిన థియరీ బేస్డ్ ఉంచాలని భావిస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఇంటి వద్ద నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించేలా మార్పులు చేసేందుకు సీబీఎస్ఈ సిద్ధమైంది. దీని కోసం పాఠశాలల యాజమాన్యాలు డిజిటల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 10, 12వ తరగతుల సీబీఎస్ఈ బోర్డు పరీక్షా ఫలితాలు జూలై 15న వెలువరించనుంది. సీబీఎస్ఈతో పాటు రాష్ట్రాల ఎస్ఎస్ఎస్సీ బోర్డులు కూడా మార్పులు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్ధులకు రోజుకి నాలుగైదు క్లాసులు చెబుతున్నాయి. మరోవైపు కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలలు తెరుస్తామని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. ఏపీలోనూ ఆదిశగా రాష్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అటు డిగ్రీ, పీజీ పరీక్షలపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే పదవతరగతి పరీక్షలు రద్దుచేశాయి. తెలంగాణ ప్రభుత్వం గ్రేడింగ్ లతో ఫలితాలు ప్రకటించింది. ఒకవేళ పాఠశాలలు ప్రారంభించినా ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపిస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాఠశాలల ప్రారంభంపై సస్పెన్స్ కొనసాగుతోంది. 

Related Posts