YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

27 నాటికి భారత్ కు రఫెల్...

27 నాటికి భారత్ కు రఫెల్...

27 నాటికి భారత్ కు రఫెల్...
న్యూఢిల్లీ, జూన్ 30
చైనా సరిహద్దులో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సరిహద్దులో బలగాల సంఖ్యను పెంచడంతో పాటు అస్త్రశస్త్రాలను తరలిస్తోంది. అత్యవసర కొనుగోళ్లకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ యుద్ధ విమానాలను త్వరగా తెప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.జులై 27 నాటికి అత్యాధునిక క్షిపణులను అమర్చిన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. లెక్క ప్రకారం నాలుగు విమానాలు రావాల్సి ఉండగా.. భారత్‌ మొత్తం ఆరు విమానాలను ఇవ్వాలని ఫ్రాన్స్‌ను కోరుతోంది. దీనికి ఫ్రాన్స్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే 8 విమానాలు సిద్ధమై, సర్టిఫికేషన్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.భారతీయ పైలట్లకు రఫేల్ విమానాలపై శిక్షణ కొనసాగుతోంది. వారే అక్కడి నుంచి విమానాలను భారత్‌లోని అంబాలా వాయుసేన స్థావరానికి చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను కూడా వీలైనంత తొందరగా భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం రష్యాపై ఒత్తిడి తెస్తోంది.రష్యా ముందుగా సరఫరా చేస్తామన్న సమయం కంటే ముందే రాఫేల్ యుద్ధ విమానాలు ఇవ్వాలని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యాను కోరారు. దీంతో పాటు భారత్‌కు అవసరమైన బిలియన్‌ విలువైన అదనపు ఆయుధ సామగ్రిని కూడా కొన్ని వారాల్లో సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. మరోపక్క చైనా ఇలాంటి గగనతల రక్షణ వ్యవస్థనే కొనుగోలు చేసింది. దీన్ని లద్దాఖ్‌లో మోహరించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు

Related Posts