YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సిద్దరామయ్య నిరసన

సిద్దరామయ్య నిరసన

సిద్దరామయ్య నిరసన
బెంగళూరు జూన్ 30
దేశంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. దీంట్లో భాగంగా కర్ణాటకలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య,మరో సీనియర్ నేత డీకే శివకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. సిద్ధరామయ్య, శివ కుమార్ ఇద్దరూ తమతమ నివాసాల నుంచి సైకిల్ తొక్కుతూ ఆందోళన జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం ఓ బైకుకు పాడె కట్టి అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, శివకుమార్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో ఇంధన ధరలు ఏ మాత్రం పెరిగినా బీజేపీ నాయకులు గగ్గోలు పెట్టేవారని, ఇప్పుడు ఇరవై రోజులకుపైగా రోజూ క్రమం తప్పకుండా ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నా యని ప్రశ్నించారు. పెరిగిన ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Related Posts