చైనాలో వెలుగులోకి వచ్చిన మరో భయంకర వైరస్
న్యూ ఢిల్లీ జూన్ 30
ఇప్పటికే ఈ వైరస్ తో ప్రపంచ దేశాలన్నీ వణి కిపోతున్న తరుణం లో చైనా పరిశోధకులు మరో సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనం లో మహమ్మారిని తలపించే విధంగా ఉన్న ఓ కొత్త రకమైన స్వైన్ ఫ్లూను వారు కనుగొన్నారు. దానికి సంబంధించి అమెరికా సైన్స్ జర్నల్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. జీ4 అని పిలువబడే ఈ వైరస్ జన్యుపరం గా హెచ్ 1ఎన్ 1 జాతి నుండి వచ్చిందని వారు అంటున్నారు. ఈ వైరస్ మానవులకు సోకే ప్రమాదం ఉందని.. తొలి దశ లోనే అరికట్టాల్సిన అవసరం ఉందని.. లేదంటే మహమ్మారి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చైనీస్ వర్సిటీలు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2011 నుండి 2018 వరకు పరిశోధకులు 10 చైనా ప్రావిన్సులు పశువైద్య ఆసుపత్రిలోని పందుల కళేబరాల నుంచి 30000 నాజల్ శ్వాబ్స్ను తీసుకుని 179 స్వైన్ ఫ్లూ వైరస్లను ఐసోలేట్ చేశారు.వాటిల్లో ఎక్కువ సంఖ్య కొత్త రకం వైరస్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇవన్నీ కూడా మనుషులకు సోకే ఛాన్స్ ఎక్కువగా ఉందని.. వాటిపై విస్తృతంగా పరిశోధనలు జరపాల్సి ఉందని అంటున్నారు. జీ4 ప్రమాదకరమైన అంటువ్యాధి అని చైనీస్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ మూడు ప్రత్యేకమైన జాతుల సమ్మేళనం అని అన్నారు. ఒకటి యూరోపియన్ ఆసియా పక్షులలో కనిపించే జాతుల మాదిరిగా ఉంటుందని రెండోది 2009లో వచ్చిన సార్స్ఎం ఇన్ఫ్లూఎంజా మహమ్మారికి కారణమైన హెచ్ 1ఎన్ 1 జాతి అని మూడోది ఏవియన్ హ్యూమన్ పిగ్ ఇన్ఫ్లూఎంజా వైరస్ల జన్యువులతో కలిగి ఉన్న ఉత్తర అమెరికా హెచ్ 1ఎన్ 1 అని తెలిపారు. దీనికి విరుగుడు లేదని.. ఒకవేళ మనుషులకు సంక్రమిస్తే మిగతా ఫ్లూ వైరస్ల మాదిరిగా తగ్గదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వైరస్ చైనా పందుల నుంచి మనుషులకు సంక్రమించిందని కానీ మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తుందన్న దాని కి ఇంకా ఆధారాలు లేవన్నారు. ప్రస్తుతం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఫెర్రెట్స్తో సహా వివిధ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ఫ్లూ సమయంలో మనుషులు అనుభవించే జ్వరం దగ్గు తుమ్ములు మాదిరి లక్షణాలే ఉన్నట్లు గమనించారు. అందుకే చైనీస్ మార్కెట్లలో పందులతో పని చేసే వ్యక్తులను దగ్గరగా పర్యవేక్షించాలని పరిశోధకులు చెబుతున్నారు. కాగా జీ4 వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరించారు