YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అన్ లాక్ 2.0 మార్గదర్శకాల్ని విడుదల చేసిన కేంద్రం

అన్ లాక్ 2.0 మార్గదర్శకాల్ని విడుదల చేసిన కేంద్రం

అన్ లాక్ 2.0 మార్గదర్శకాల్ని విడుదల చేసిన కేంద్రం
న్యూ ఢిల్లీ జూన్ 30 
దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ల పర్వానికి ముగింపు పలుకుతూ.. ఆన్ లాక్ సిరీస్ ను స్టార్ట్ చేసిన కేంద్రం.. తాజాగా అన్ లాక్ 2.0 మార్గదర్శకాల్ని విడుదల చేసింది. రేపటి నుంచి (జులై 1) దేశ వ్యాప్తంగా అమల్లోకి రానున్న అన్ లాక్ 2.0ను చూసినప్పుడు మరిన్ని ఆర్థిక కార్యకలాపాలు దశల వారీగా లాకులు ఎత్తేసేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాలి. అయితే.. అన్ లాక్ 2.0లోనూ కొన్ని కీలకమైన వాటిపై నిషేధాన్ని కంటిన్యూ చేస్తుండటం గమనార్హం. అన్ లాక్ 2.0లో కీలకమైన నిర్ణయం ఏమంటే.. ముందస్తు అనుమతులు.. ఈ-పర్మిట్ల అవసరం లేకుండా ప్రయాణికులు.. సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చని తేల్చారు. అన్ లాక్ 2.0లో ఉన్నకీలకమైన అంశాల్ని మూడు రకాలుగా చెప్పొచ్చు. ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన వాటికి మరిన్ని అనుమతులు కల్పిస్తూ పరిమితులు ఎత్తేయటంగా చెప్పాలి. రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సినవి రెండో అంశంగా.. బ్యాన్ మూడో అంశంగా చెప్పాలి. మరిన్ని అనుమతులు  ఇప్పటికే అనుమతించిన రైళ్లు.. విమాన సర్వీసుల్ని రానున్న రోజుల్లో క్రమపద్దతిలో మరింతగా విస్తరిస్తారు ఆన్ లైన్.. దూర విద్యను కొనసాగించొచ్చు- జులై 15 నుంచి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థల్ని తెరుచుకోవచ్చు. కంటైన్ మెంట్ల జోన్లకు బయట ఉండే ప్రార్థన మందిరాలు.. హోటళ్లు.. అతిథ్య సేవలు.. షాపింగ్ మాళ్లు తెరవొచ్చు.ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు అవసరమైన ఈ పాస్ విధానం ఇక ఉండదు- సరకులు.. వ్యక్తుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు దేశాల్లో నిలిచిపోయిన భారతీయుల తరలింపుతో పాటు.. సముద్ర రవాణాను పునరుద్దరిస్తారు. వీటి మీద నిషేధం (జులై 31 వరకు ఉంటుంది. తర్వాత నిర్ణయం తీసుకుంటారు) పాఠశాలలు.. కాలేజీలు.. కోచింగ్ సెంటర్లు కేంద్ర హోం శాఖ అనుమతి లేని అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మెట్రో రైళ్లు.. సినిమా హాళ్లు.. జిమ్ లు.. స్విమ్మింగ్ ఫూల్స్.. అమ్యూజ్ మెంట్ పార్కులు.. థియేటర్లు.. బార్లు.. ఆడిటోరియంలు. సామాజిక రాజకీయ.. క్రీడా.. వినోద కార్యక్రమాలతో పాటు.. విద్య రాజకీయ మతపరమైన కార్యక్రమాలను అనుమతించరు. ఎప్పటిలానే కంటైన్ మెంట్ కేంద్రాల్ని ఏర్పాటు చేయటం మామూలే. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదుగంటల వరకూ కర్ఫ్యూను యథాతధంగా అమలు చేస్తారు. అయితే.. కర్ఫ్యూ వేళలో సరకు రవాణాతో పాటు.. విమానాలు.. బస్సులు.. రైళ్లు తదితర ప్రయాణాలు చేసే వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.

Related Posts