విపక్షాలు పార్లమెంటులో సభా నియమాలు ఉల్లంఘించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్లో బీజేపీ ఒక రోజు ఉపవాస దీక్షలో మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్షనేత కిషన్రెడ్డి, బీజేపీ నాయకులు కూర్చున్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్కు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. పార్లమెంటులో ప్రధాని మోడీని అడ్డుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజలచే తిరస్కరించబడ్డ పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేశాయన్నారు. ప్రాంతీయ, కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లపై పార్లమెంటును అడ్డుకున్న టీఆర్ఎస్ ప్రైవేటు యూనివర్సిటీ బిల్లులో అసలు రిజర్వేషన్లు పెట్టలేదని ఆరోపించారు.
ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... పార్లమెంట్ను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనన్నారు. అనేక సంవత్సరాల్లో జరగని అభివృద్ధి నాలుగు సంవత్సరాలలో బీజేపీ చేపట్టిందనన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి శాంతియుతంగా నిరాహారదీక్ష దీక్ష చేపడుతున్నట్లు దత్తాత్రేయ తెలిపారు