YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకల్ లీడర్స్ అడ్డుపడుతున్నారు..

లోకల్ లీడర్స్ అడ్డుపడుతున్నారు..

విజయవాడ, జూలై 1, చంద్రబాబునాయుడు బీజేపీతో సయోధ్యగా ఉందామని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఏపీ బీజేపీ నేతలు కొందరు అడ్డుపడుతుండటమే ఇందుకు కారణమంటున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత చంద్రబాబు బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. అందుకోసమే తన పార్ట్ నర్ పవన్ ను ముందుగా బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేశారన్న ప్రచారం కూడా జరిగింది.కానీ జనసేనతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ మాత్రం చంద్రబాబుతో కలసి వెళ్లేందుకు సిద్ధంగా లేదు. కానీ చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలను వదలడం లేదంటున్నారు. ఇటీవల మరోసారి ఆర్ఎస్ఎస్ నేతలతో చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీతోనే ఉండాలన్న తన నిర్ణయాన్ని కూడా చంద్రబాబు వారితో చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆర్ఎస్ఎస్ నేతలు కూడా రాష్ట్ర బీజేపీ నేతలపైనే పెట్టినట్లు టాక్ నడుస్తోంది.చంద్రబాబు ఓటమి పాలయిన తర్వాత బీజేపీతో సఖ్యతగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం మోదీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తున్నారు. చివరకు పెట్రోల్ ధరలు పెరిగినా మోదీని ఏమీ అనలేక జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయాల్సి వచ్చింది. పెట్రోలు ధరలను తగ్గించాలని జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. ఇలా మోదీకి దగ్గరవ్వాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకూ ఫలించలేదనే చెప్పాలి.ఆ మధ్య మోదీ ఫోన్ చేసిన వెంటనే కొంత చంద్రబాబుకు ధైర్యం కలిగింది. అయితే తాజా సంఘటనతో చంద్రబాబుకు బీజేపీతో దగ్గరయ్యే ఛాన్స్ లేదంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల భేటీ వెనక చంద్రబాబు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిందంటున్నారు. ఇలా తమ పార్టీ వారిని చంద్రబాబు ఉపయోగించుకోవడంపై బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు సయితం చంద్రబాబుతో దూరం బెటరని గట్టిగా చెబుతుండటంతో ఆయన సయోధ్య ప్రయత్నాలు ఫలించడం లేదు.

Related Posts