YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

రోల్ మోడల్ గా మారుతున్న మిజోరాం

రోల్ మోడల్ గా మారుతున్న మిజోరాం

న్యూఢిల్లీ, జూలై 1 కరోనాను కట్టడి చేయలేక అన్ని రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలు చేతులెత్తేసినట్లే కనపడుతుంది. ఒక్కరోజులోనే వేల సంఖ్యలో కేసులు ఈ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ముంబయి, ఢిల్లీ నగరాల సంగతి ఇక వేరే చెప్పనవసరం లేదు. అయితే దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు మిజోరాం భిన్నంగా నిలిచింది. మిజోరాంలో ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తుంది. ఈ నెల చివరి వరకూ కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే అక్కడ కేసుల సంఖ్యను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మిజోరాంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 150 లోపే. వారిలో దాదాపు 35 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కానీ మిజోరాంలోకి కరోనా ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.అయితే ఈ రాష్ట్రంలో కరోనా కట్టడికి కేవలం ప్రభుత్వం చర్యలు మాత్రమే కాదు. స్వచ్ఛంద సంస్థల పాత్రను కాదనలేం. మిజోరాంలో ప్రస్తుతం మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. అయితే కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం మాత్రమే కాదు స్వచ్ఛంద సంస్థలైన యంగ్ మిజో అసోసియేషన్, వర్తకుల సంఘం కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పక తప్పదు. రాష్ట్రంలోకి ఎవరూ అక్రమంగా చొరబడకుండా కూడా యంగ్ అసోసియేషన్ సభ్యులే మయన్నార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కాపలా కాస్తుండటం విశేషం. దీంతో కొత్తగా రాష్ట్రంలోకి ఎవరినీ రానివ్వకుండా, ఉన్నవారిని లాక్ డౌన్ తోనూ కరోనా కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. వాహనాలను కూడా రోడ్ల మీదకు పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. ఇక ఎక్కువ కాలం లాక్ డౌన్ మిజోరాంలో అమలులో ఉండటంతో వర్తకుల సంఘం చిరు వ్యాపారులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా కేవలం ప్రభుత్వమే కాకుండా వివిధ సంస్థలు కరోనా కట్టడికి తమ సహకారం అందిస్తుండటంతోనే అక్కడ కరోనా పెద్దగా వ్యాప్తి చెందలేదు

Related Posts