YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళా ఉద్యోగిని  పై దాడికి పాల్పడ్డ నిందితుడి సస్పెన్షన్ - పర్యాటక శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ వెల్లడి

మహిళా ఉద్యోగిని  పై దాడికి పాల్పడ్డ నిందితుడి సస్పెన్షన్ - పర్యాటక శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ వెల్లడి

మహిళా ఉద్యోగిని  పై దాడికి పాల్పడ్డ నిందితుడి సస్పెన్షన్
- పర్యాటక శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ వెల్లడి
నెల్లూరు 
నెల్లూరు నగరంలోని హరిత హోటల్ (పర్యాటక శాఖ) కార్యాలయంలో జరిగిన దురదృష్టకర సంఘటన అని ఆ శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. నెల్లూరు పర్యాటక శాఖ కార్యాలయ డిప్యూటీ మేనేజర్, నిందితుడు సి, భాస్కర్ ను సస్పెండ్ చేసి, విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. మరోవైపు, మహిళా ఉద్యోగి నుండి ఫిర్యాదు వచ్చిన వెంటనే భాస్కర్ సస్పెండ్ చేశామని, క్రమశిక్షణా చర్యలు పరిశీలిస్తున్నారని, నిందితుడు ముందస్తు అనుమతి తీసుకోకుండా హెడ్ క్వార్టర్స్ నుండి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇటువంటి దుర్ఘటన లు పర్యాటక శాఖ లో జరగకుండా ఉండే విధంగా నిందితుడు భాస్కర్ రావు పై కఠిన చర్యలు తీసుకునేందుకు శాఖాపరంగా తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు.

Related Posts