బాధిత మహిళా ఉద్యోగిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కకమిషన్ చైర్ పర్సన్
నెల్లూరు
ఏపీ టూరిజం మహిళా ఉద్యోగిని ఉషారాణి పై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావు విచక్షణారహితంగా దాడి చేయడం విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ , స్థానిక ఏపీ టూరిజం హోటల్ లో ఆమెను పరామర్శించారు. జరిగిన ఘటన విషయమై ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు బాధ్యులైన అధికారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సింహపురి మహిళలు మాట్లాడుతూ ప్రస్తుత ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సూచనలు సలహాల మేరకు బాధ్యతాయుతంగా మెలగాల్సిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావు, మాస్కు కట్టుకొని మాట్లాడమని చెప్పినందుకే, సహనం కోల్పోయిన భాస్కర్ రావు, డాక్టర్ మహిళా ఉద్యోగిని, దివ్యాంగురాలు అని కూడా చూడకుండా, దాడి చేయడం అమానుషం అన్నారు. వెంటనే అధికారులు, శాఖ మంత్రులు, మహిళా కమిషన్ , వెంటనే స్పందించి, నిందితుడిని సస్పెండ్ చేయడం, అరెస్టు చేయడం, బాధిత మహిళకు మేమున్నాం అంటూ ధైర్యం చెప్పడం ఇదంతా ఒక్కరోజులోనే జరగడం అభినందనీయమని సింహపురి ప్రజలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం శాఖ మహిళా సిబ్బంది, స్థానిక నాల్గో నగర పోలీస్ స్టేషన్ సిఐ నాగేశ్వరమ్మ,, సింహపురి మహిళామణులు తదితరులు పాల్గొన్నారు.