అమరావతి జులై 01. 108, 104 సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం గుంటూరు జీజీహెచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం, నాట్కోట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా నాట్కో ట్రస్ట్, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన నూతన కాంప్రహెన్సీవ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాట్కో ట్రస్ట్ ఈ క్యాన్సర్ కేర్ సెంటర్ కోసం నిధులను అందించడం పట్ల నాట్కో ట్రస్ట్ సీఎండి నన్నపనేని వెంకయ్య చౌదరి, ఇతర ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు. ప్రజల ఆరోగ్యం కోసం నాట్కో ట్రస్ట్ ఈ రకంగా ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఈ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుతో పేదలకు ఉచితంగానే ఖరీదైన క్యాన్సర్ చికిత్సను అందించడానికి వీలు పడుతుందని అన్నారు. అలాగే ఈ సెంటర్ కారణంగా రాష్ట్రానికి రెండు పీజీ ఆంకాలజీ రేడియేలజిస్ట్ పోస్ట్ లు కూడా రావడం మరింత సంతోషంను కలిగిస్తోందని అన్నారు. ఈ సెంటర్ ద్వారా మెడికల్, సర్జికల్, రేడియోలజీ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఎఇఆర్బీ అనుమతి వున్న మొట్టమొదటి యూనిట్ ఇది. ఇటువంటిదే కర్నూల్ లో నిర్మిస్తున్నాం. మరో ఏడాది కాలంలో అదికూడా పూర్తిగా ఆపరేషన్ లోకి వస్తుందని సీఎం అన్నారు.