ఆదిలాబాద్, జూలై 1. అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని, రాష్ట్రంలోఅటవీప్రాంతాన్నిపెంచడానికే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిఅన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ డే లో పాల్గొని మంత్రి మొక్కలు నాటారు. బుధవారం మావల హరిత వనం నుంచి చాందా-టీ వరకు రోడ్లకు ఇరువైపులా ఒకేరోజు లక్ష మొక్కలునాటారు. అనంతరంఎమ్మెల్యేలుజోగురామన్న, రాథోడ్ బాపురావు, కలెక్టర్ దేవసేనతో మావల హరితవనంలో పర్యావరణ విజ్ఞానకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. హరితవనంలోమొక్కలు నాటడంతోపాటు విత్తనాలు చల్లారు. సఫారి వాహనంలో హరితవనంలో కాసేపు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అడవులరక్షణకు, అడవులను పునురుద్ధరించడానికి సీయం ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. గత ఐదు విడతల్లో హరితహారం కార్యక్రమంలోభాగంగా నాటిన మొక్కల్లో 70% బతికాయని, పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టం ప్రకారం నాటిన మొక్కల్లో 85% సర్వైవల్ అయ్యేలా చూసే బాధ్యత స్థానికప్రజాప్రతినిధులు, అధికారులదేనని స్పష్టంచేశారు. ఈ ఏడాది 30 కోట్లమొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. అడవులరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగాదృష్టి సారించిదని, కలప స్మగర్లపై పీడీయాకట్ కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ క్షేత్రాల రక్షణ మనందరి బాధ్యత అని, కలప అక్రమ రవాణాకు సంబంధించి అధికారులకు సమాచారం అందివ్వాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.