YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కరోనాతో వణుకుతున్న ఢిల్లీ

కరోనాతో వణుకుతున్న ఢిల్లీ

న్యూఢిల్లీ, జూలై 2, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ముంబయిని మించి పోయి కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఎనభై వేలు దాటింది. మరణాల సంఖ్య కూడా మూడు వేలకు చేరువలో ఉన్నాయి. సామాన్యులతో పాటు రాజకీయ నేతలు కూడా ఈ వ్యాధిన బారిన పడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అందుకే ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా పదివేల బెడ్స్ సామర్థ్యంతో ఆసుపత్రిని నిర్మించాల్సి వచ్చింది.కరోనా వ్యాప్తి ఢిల్లీ నుంచే ప్రారంభమయింది. మర్కజ్ మసీద్ ప్రార్థనల నుంచి ఈ వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరించింది. అనేక రాష్ట్రాలకు కరోనా వైరస్ ఢిల్లీ నుంచే సోకింది. అయితే దాదాపు అరవై రోజుల పాటు పటిష్టమైన లాక్ డౌన్ ను విధించడంతో ఢిల్లీలో కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యాయి. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత మాత్రం ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపు అవతున్నాయి.దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో కరోనా కంట్రోల్ కు రంగంలోకి దిగింది. హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కరోనా నియంత్రణపై అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో అన్ని కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా లభించడం లేదు.పెరుగుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు కూడా లేరు. దీంతో పదివేల పడకల ఆసుపత్రిని ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక మీద నిర్మించింది. టెస్ట్ ల సంఖ్య పెంచడం వల్లనే కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ముందస్తు చర్యలు తీసుకోక పోవడం వల్లనే ఢిల్లీలో కోవిడ్ విలయతాండవం చేస్తుందని బీజేపీ, కాంగ్రెస్ లు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద ఢిల్లీ కరోనాతో వణికిపోతుంది.

Related Posts