YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాళేశ్వరం సరే...ఎల్లంపల్లి సంగతేంటీ

 కాళేశ్వరం సరే...ఎల్లంపల్లి సంగతేంటీ

కరీంనగర్, జూలై 2, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఇటీవలే అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. ఇంకా కొంతవరకు పనులు మిగిలే ఉన్నా లాంఛనంగా రిబ్బన్ కట్ చేశారు. కానీ ఏడేళ్ల ముందే పూర్తయి, వినియోగంలోకి వచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇప్పటికీ అధికారికంగా ప్రారంభోత్సవం జరగలేదు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్కుమార్రెడ్డి.. తన పదవీకాలంలో చివర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. అధికారులు ప్రాజెక్టు వద్ద పైలాన్ నిర్మించి, సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేశారు. కానీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న ఆ సమయంలో ఇది ఉద్రిక్తతలు పెంచింది. ఏపీకి చెందిన కిరణ్ ఎల్లంపల్లిని ప్రారంభించడమేంటని తెలంగాణ వాదులు నిరసనలు వ్యక్తం చేశారు. అప్పట్లో కరీంనగర్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్.. ఆంధ్రా ప్రాంత సీఎంలకు తెలంగాణలోని ప్రాజెక్టులను ప్రారంభించే అర్హత లేదని, అలా కాదని వస్తే హెలికాప్టర్ను గాల్లోనే పేల్చేస్తామని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో కిరణ్ ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. 2014లో రాష్ట్రం ఏర్పాటై, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎల్లంపల్లిని అధికారికంగా ప్రారంభిస్తారని భావించారు. కానీ ఆరేళ్లవుతున్నా దానిని పట్టించుకున్నవారు లేరు.ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎల్లంపల్లికి 2004 జులై 28న శంకుస్థాపన చేశారు. మొదట పనులు వేగంగానే జరిగినా, 2009లో వైఎస్ మరణించాక జాప్యం జరిగింది. రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాల్లో మెల్లగా కొనసాగి 2013 నాటికి ప్రాజెక్టు పూర్తయింది. దీని పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలుకాగా.. 6.5 టీఎంసీలు రామగుండం ఎన్టీపీసీకి, 2 టీఎంసీలు మంథని ఎత్తిపోతలకు కేటాయిస్తున్నారు. కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సైతం ఎల్లంపల్లి నుంచే గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరందిస్తున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుజల స్రవంతి పథకం ద్వారా 10 టీఎంసీలు తరలిస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోనూ ఎల్లంపల్లి కీలకం. మేడిగడ్డ నుంచి దశలవారీగా నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసి, అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇంత ప్రాధాన్యమున్న ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ప్రారంభోత్సవం చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.టీఆర్ఎస్ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చాక ప్రాణహిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుగా చేపట్టింది. మూడేళ్లలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మూడు రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించారు. ప్రభుత్వపరంగా ఈ ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.

Related Posts