హైద్రాబాద్, జూలై 2, గ్రేటర్‌లో పెరుగుతున్న కరోనా కేసులపై పోలీస్ డిపార్ట్ మెంట్ ఫోకస్ పెట్టింది. వైరస్ స్ప్రెడ్ అవకుండా కంట్రోల్ చేయడంతోపాటు మళ్లీ లాన్‌డౌన్ విధిస్తే తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్స్ రెడీ చేస్తోంది.అందుకోసం సిటీలోని కరోనా ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఇంటెలిజెన్స్ తో సర్వే చేయిస్తోంది. పబ్లిక్ తోపాటు లాక్‌డౌన్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న హెల్త్, పోలీస్ సిబ్బందిలో కేసుల పెరగడానికి కారణాలు తెలుసుకుంటోంది. సిటీ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే సేకరించిన రిపోర్ట్స్ తో ప్రణాళికలు రూపొందిస్తోంది.సిటీలో కరోనా వ్యాప్తికి కోవిడ్–19 గైడ్ లైన్స్ పాటించక పోవడమే కారణమని ఇంటెలిజెన్స్ పోలీసులు రిపోర్ట్ చేసినట్లు తెలిసింది. హోల్‌సేల్ మార్కెట్లలో ఫిజికల్ డిస్టెన్స్ , శానిటేషన్ లోపాలు కారణంగా పేర్కొన్నారు. తిరిగి లాక్‌డౌన్ విధించడం వల్ల కొంత వరకైనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్చేసే చాన్స్ ఉన్నట్లు కేస్ స్టడీస్ ఉదాహరణగా చెప్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్ విధిస్తే యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలో పోలీస్ బాస్లు డిస్కస్ చేస్తున్నారు. సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో తమను తాము కాపాడుకుంటూనే బందోబస్తు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సౌత్, వెస్ట్ జోన్లలోనే పోలీస్ పరేషాన్‌హోం మంత్రి మహమూద్ అలీ తోపాటు ఆయన ఎస్కార్ట్ సిబ్బంది కరోనా బారిన పడడానికి కారణాలను ఇంటెలిజెన్స్ సిబ్బంది కలెక్ట్ చేసింది. సిటీలో సుమారు 250 మంది పోలీసులకు వైరస్ సోకిన తీరును రికార్డ్ చేసినట్లు తెలిసింది. పాత బస్తీతో పాటు వెస్ట్ జోన్లో ఎక్కువ కేసులు నమోదైనట్లు స్పెషల్ బ్రాంచ్ పేర్కొంది. సౌత్, వెస్ట్ జోన్లలోని చాలా ఏరియాల్లో గైడ్‌లైన్స్ పాటించలేదని గుర్తించింది. మార్కెట్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం లేదని రిపోర్ట్ చేసినట్లు సమాచారం.స్టేషన్ల కి వచ్చే బాధితులు, నిందితుల విషయం లో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే పోలీసులపై కరోనా ఎటాక్ చేసినట్లు గుర్తించారు. జియాగూడ, కుల్సుంపురా, టప్పాచబుత్రతో పాటు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఏరియాల్లో డ్యూటీ చేసిన పోలీసులకు పబ్లిక్ ప్లేసెస్ నుంచే సోకినట్లు నివేదించారు. కంటైన్‌మెంట్ ఏరియాల్లో సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోలేదని డీటెయిల్స్ సేకరించారు. ఈక్రమంలో మరోసారి లాక్‌డౌన్ పెడితే బందోబస్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పేర్కొన్నారుకరోనా నుంచి కోలుకుని డ్యూటీలో జాయిన్ అయిన 31మంది పోలీసులను సిటీ సీపీ అంజనీ కుమార్ అభినందించారు. అంబర్‌పేట్ సీపీఎల్, బంజారాహిల్స్ సిబ్బందికి సీపీ పురస్కారాలు అందించి, సెల్యూట్ చేశారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న పోలీసులను రియల్ హీరోస్‌గా అభివర్ణించారు.