YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

20 శాతానికే పరిమితమవుతున్న వ్యాపారాలు

20 శాతానికే పరిమితమవుతున్న వ్యాపారాలు

హైద్రాబాద్, జూలై 2, కరోనా మహమ్మారి వ్యాపారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 78 రోజుల పాటు కొనసాగిన లాక్‌డౌన్‌ వల్ల వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతగిలింది. అద్దె బతుకులు భారంగా మారాయి. ఇటీవల సడలిం పులు నేపథ్యంలో వ్యాపారాలు పున:ప్రారంభ మయ్యాయి. కానీ రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో అవసర మైతేనే ప్రజలు బయటకు వస్తున్నారు. ప్రధానంగా నిత్యావసరాలకు తప్పితే.. ఇతర వాటికోసం ఖర్చు చేయడం లేదు. దాంతో గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం 20-30 శాతానికే వ్యాపారాలు పరిమితమయ్యాయి.ఈక్రమంలో దుకాణాల అద్దెలు చెల్లించేందుకు అవస్థలు పడుతు న్నారు. కొంతమంది ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం బంద్‌ పెట్టి పండ్లు, కూరగాయలు అమ్ముకుంటే కనీసం ఇంటి ఖర్చులకైనా వస్తాయని చెబుతున్నారు.  హైదరాబాద్‌ నగరంలో ప్రధానంగా సికిం ద్రాబాద్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, రామంతాపూర్‌, అంబర్‌పేట, న్యూ నల్ల కుంట, ఫిర్జాదీగూడ ఇలా అనేక ప్రాంతాల్లో రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టిన వ్యాపారులు షాపులు తెరవక అద్దెలు చెల్లించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.లాక్‌డౌన్‌కు ముందు చిన్నచిన్న దుకాణాల్లో రోజుకురూ.2వేల-3వేల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం కరోనా భయం, ఆదాయాల్లేక జనం ఖర్చుకు వెనుకాడుతుండటంతో దుకాణాలకు రావడం లేదు. దీంతో రోజు వ్యాపారం రూ.300-400కు పడిపోయిందని ఉప్పల్‌కు చెందిన ఫ్యాన్సీ స్టోర్‌ నిర్వాహకుడు శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. షాపు అద్దె నెలకు రూ.9వేల చొప్పున మూడు నెలలకు రూ.27వేలు చెల్లించాల్సి ఉందని, ఇంటి అద్దె కచ్చితంగా ఇవ్వాల్సిందేననడంతో రూ.5వేల చొప్పున కట్టినట్టు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బతకడం కష్టమేనని ఆందోళన వ్యక్తం చేశారు. కిరాణా, మెడికల్‌ షాపులకు తప్ప ఇతర వాటికి గిరాకీ లేదు.ఇక నగరంలో దాదాపు 2లక్షల ట్రేడ్‌ లైసెన్స్‌లు కలిగిన వ్యాపారులు ఉండగా.. అనధికారికంగా మరో లక్ష వరకు ఉంటాయని అంచనా. కాగా కరోనా కాలంలో వ్యాపారులకు దాదాపు రూ.2వేల కోట్లకుపైగా నష్టం జరిగినట్టు అంచనా.చిన్నా చితకా ఉద్యోగం చేసుకుంటూ అద్దె ఇండ్లల్లో ఉండే వారి పరిస్థితి అధ్వానంగా ఉంది. లాక్‌డౌన్‌ మూలంగా కంపెనీలు మూత పడటంతో పని లేక ఇండ్ల వద్దే ఉండిపోయారు. దీంతో మూడు నెలల అద్దె చెల్లించాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. లేకుంటే ఖాళీ చేయాలం టున్నారని ఆందోళన చెందుతున్నారు.లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలుగా షాపుబంద్‌ ఉంచాం. ఈ సమయంలో దాదాపు రూ.3లక్షల వ్యాపారం కోల్పోయాను. షాపు అద్దె రూ.10వేల చొప్పున మూడు నెలలది కట్టాలి. ఇటీవల దుకాణం తెరిచాం. కానీ, జనం రావడం లేదు. నెల రోజులకుగాను రూ.2వేలు మాత్రమే వచ్చింది. గతంలో నెలకు 30-50 వేల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం ఆదాయం లేక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. నా భార్య జాకెట్‌లు కుడుతుంది. ఇపుడిప్పుడే ఎదుగుతున్న నా జీవితంలో కరోనా ఒక పిడుగు లాంటిది.

Related Posts