దోమల ఫాగింగ్ యంత్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
హైదరాబాద్
మూసినది పరివాహక ప్రాంతాలలో దోమలను అరికట్టడానికి కొనుగోలు చేసిన పది దోమల ఫాగింగ్ యంత్రాలను మూసి రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేషన్ ఏం.డీ.విశ్వజిత్ కంపాటి, స్థానిక చైతన్య పూరి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి తో కలిసి చైతన్య పూరి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ ప్రక్కన ఉన్న ముసినది పరివాహక ప్రాంతంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలచే బాపుఘాట్ నుండి నాగోల్ వరకు ముసి పరివాహక ప్రాంతాల్లో ఇరువైపులా ఫాగింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కరోన వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నేపథ్యంలో,దోమల వల్ల వచ్చే ఇతర వ్యాధుల నుండి ప్రజలు రక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు. ప్రజలు కూడా తమ వంతు సామాజిక బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అయన కోరారు