ప్రదాన మంత్రి మోడీ అమీత్ షా తన మంత్రులు దీక్ష దేనికి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి.నక్కా అనంద్ బాబు ప్రశ్నించారు. దీక్షలు వాళ్ళ అసమర్థత కు నిదర్శనం. ప్రతిపక్ష లు అడిగింది అవిశ్వాస తీర్మానం ..దానిని చూసి భయపడారుని అయన వ్యాఖ్యానించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఏపికి న్యాయం చేసి ఉంటే చెప్పవచ్చు కదా. విభజన హామీ లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంటులో చేసిన దానికే దిక్కులేకుండా పోయింది. ప్రతిపక్ష నేత జగన్ మాత్రం మోడీ దీక్ష పై నోరు విప్పరు. హాదా ఇచ్చేది చంద్రబాబు నాయుడు కాదని అయన అన్నారు. జగన్ ఇప్నుడు మోడీ తో రాజీ పడ్డారు. జగన్ బ్రతుకే చీకటి బ్రతుకు.డిల్లీ ఏ,2 ముద్దాయి ని ఎజెంటుఎ గా పెట్టుకున్నారు. జగన్ మోహన్ రెడ్డికి మోడీ కి మద్య ఉన్న ఒప్పందం ను బయట పెట్టాలని అయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి రాజధాని ఇక్కడ పెట్టడం ఇష్టం లేదు. దీనిపై కుట్రలు చేశారు. రాజధాని అనుకులమా వ్యతిరేకమా జగన్ చెప్పాలి. పట్టిసీమ తో 30 కోట్లు విలువైన పంటను కాపాడం. కేంద్రం ప్రభుత్వం దళితుల కు అన్యాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఫై నమ్మకం లేక రాష్ట్ర ప్రభుత్వం రివ్యు పిటిషన్ దాఖలు చేశామన్నారు. దమ్ముంటే కలసి రా పోరాడుదామని అయన సూచించారు.