YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నకిలీ విత్తనాలు స్వాధీనం

నకిలీ విత్తనాలు స్వాధీనం

నకిలీ విత్తనాలు స్వాధీనం
వికారాబాద్ 
నకిలీ విత్తనాలు అమ్మితే , పి డి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వికారాబాద్ టాస్క్ ఫోర్స్ డి ఎస్ పి సంజీవ్ రావు హెచ్చరించారు. దౌల్తాబాద్ మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమచారం మేరకు , గత వారం దౌల్తాబాద్ మండలం   నీటూర్ గ్రామంలో దాడులు నిర్వహించారు.   పెద్దమొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి  కేసులు నమోదు చేశారు. 
మరింత దర్యాప్తు జరిపారు.  కర్ణాటక ప్రాంతంలోని గుర్మిట్కల్ నియోజకవర్గంకేంద్రంలో  నెల్లూరు జిల్లాకు చెందిన నల్లబోతూల కిరణ్ కుమార్ నుంచి నిందితులు ఈ నకిలీ విత్తానాలు కొన్నట్లు చెప్పారు. దాంతో టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం   గుర్మిట్కల్ లో నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ ఇంటిపై దాడులు చేసారు. దాడుల్లో ఆరవై  కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు  పలు కంపెనీల పేరుతో ఉన్న ఖాళీ కవర్లు, ప్యాకింగ్ యంత్రంతో పాటు నిందితున్ని అదుపులో తీసుకోని కేసు నమోదు చేశారు .ఈ కేసులో ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నట్లు, త్వరలో అతన్ని కూడ  పట్టుకుంటామని   డి ఎస్ పి సంజీవ రావ్ వెల్లడించారు. ఇలాంటి నకిలీ విత్తనాలను రైతులు వినియోగించరాదు,  అమ్మకాలు జరిపితే పోలీసులు  దృష్టికి తీసుకోరావాలని ఆయన కోరారు.

Related Posts