YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - మంత్రి పువ్వాడ - రవాణా ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటిన మంత్రి

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - మంత్రి పువ్వాడ - రవాణా ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటిన మంత్రి

హైదరాబాద్ జూలై 2, వాతావరణ సమతుల్యతను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, అందుకే ప్రతి ఒక్కరు విధిగా ముక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఖైరతాబాద్లోని డా.బి.ఆర్. అంబేద్కర్ ట్రాన్స్పోర్ట్ భవన్లో మంత్రి పువ్వాడ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత అవశ్యకతను వివరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యం.  హరిత ఉద్యమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. పర్యావరణ సమతుల్యతను సాధించి, తెలంగాణను పచ్చగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలి. విరివిగా మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.  ముఖ్యమంత్రి  దూరదృష్టి, ప్రణాళికకు అనుగుణంగా అందరి సహకారంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలో హరితహారం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తోంది.   పట్టణాలు, గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.   అడవులను కాపాడాలి - చెట్లను సంరక్షించాలి అనే  ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.  ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ సంస్థలు,  ప్రజలు పూర్తి స్థాయిలో హరితహారం కార్యక్రమంలో మమేకమై  మొక్కలు నాటి సంరక్షిస్తుండటం అభినందనీయం.  ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయం హరిత ప్రాంగణానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తోంది. మొక్కలు నాటడమే కాదు, నాటిన మొక్కలను సంరక్షించడం ముఖ్యం.   పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖ చట్టం ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులకు నాటిన మొక్కలను 85 శాతం సంరక్షించే బాధ్యతను ప్రభుత్వం అప్పగించడం జరిగింది.    తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా దాదాపు 30 కోట్ల మొక్కలను నాటాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని నిర్విగ్నంగా కొనసాగిస్తోందని మంత్రి అన్నారు.

Related Posts