యాంగాన్ జూలై 2, మయన్మార్ జూలై 2 మయన్మార్‌లో మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 60 మందికి పైగా మృతిచెందారు. ఉత్తర మయన్మార్‌లో ఉన్న ఆకుపచ్చ రాయి గనిలో ఈ ప్రమాదం జరిగింది. మట్టిచరియల కింద కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అగ్నిమాపక శాఖ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. కాచిన్ రాష్ట్రం పకంత్ ప్రాంతంలో లో ఉన్నఈ గనిలో రాళ్లు సేకరిస్తున్న సమయంలో భారీ వర్షం వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 50 మృతదేహాలను వెలికితీసారు. మట్టికింద మరింత మంది కార్మికులు మృతి చెంది వుండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో తరచూ జరుగుతుంటాయి. 2015లో ఇక్కడే జరిగిన దుర్‌లటనలో 116 మంది మరణించారు.