తిరుమల జూలై 2, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయవల్ల ప్రపంచం త్వరలో కరోనా వైరస్ నుంచి బయటపడుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో టిటిడి అధికారులు అన్ని జాగ్రత్తలు అమలుచేస్తూ భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నారని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా రోజుకు దాదాపు 10 వేల మంది భక్తులు సంతోషంగా స్వామిని దర్శించుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. త్వరలోనే తిరుమల పూర్వస్థితికి వచ్చి భక్తులతో కళకళలాడుతుందన్నారు. అనంతరం ఆయన నాదనీరాజన వేదికపై టిటిడి నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు