YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌కు నేటితో వంద రోజులు

దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌కు నేటితో వంద రోజులు

హైద‌రాబాద్‌ జూలై 2, కేంద్ర ప్ర‌భుత్వం విధించిన దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌కు నేటితో వంద రోజులు పూర్తి అయ్యింది. ప్ర‌పంచం ఇలాంటి సంద‌ర్భం ఊహించి ఉండ‌దు.  భార‌త్ కూడా ఇంత క‌ఠినంగా లాక్‌డౌన్‌లోకి వెళ్తుంద‌న్న సందేహాం కూడా ఎవ‌రికి వ‌చ్చి ఉండ‌దు. కానీ క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం చైనాలోని వుహాన్‌లో తొలుత క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి.  కొన్ని వారాల వ్య‌వ‌ధిలోనే ఆ వైర‌స్‌.. యూరోప్ దేశాల‌ను వ‌ణించింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త ప‌డింది.  మార్చి 25వ తేదీ నుంచి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను అడ్డుకునేందుకు,  అంతుచిక్క‌ని ఆ వైర‌స్ వ‌ల్ల ప్రాణాలను కాపాడుకునేందుకు మోదీ స‌ర్కార్ దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది.  చాలా వ‌ర‌కు ప్ర‌పంచ‌దేశాలు ఇంకా లాక్‌డౌన్ ద‌శ‌లోనే ఉన్నాయి. తొలుత మార్చి 25న మూడు వారాలపాటు (ఏప్రిల్‌ 14 వరకు) లాక్‌డౌన్‌ విధించారు. అప్పటికి దేశంలో దాదాపు 600 కేసులు ఉండగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం మూడో విడుతలో మరో రెండు వారాలపాటు (మే 17 వరకు) లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం.. దేశాన్ని రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లుగా విభజించింది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం జూన్‌ 1 నుంచి అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించింది. జూన్‌ 8 నుంచి షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. జూలై 1నుంచి అన్‌లాక్‌ 2.0 మొదలైంది.వంద రోజుల లాక్‌డౌన్ త‌ర్వాత భార‌త్‌లో.. క‌రోనా వైర‌స్ పాజిటివ్‌ కేసుల సంఖ్య‌ ఆరు ల‌క్ష‌లు దాటింది. దేశంలో వైర‌స్ మ‌ర‌ణాల సంఖ్య 17 వేలు దాటింది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ నియంత్ర‌ణ‌కు వ్యాక్సిన్ త‌యారీ జోరందుకున్న‌ది.  భార‌త్‌లోనూ వ్యాక్సిన్ త‌యారీపై దృష్టిపెట్టారు.  మాస్క్‌లు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టాన్సింగ్ లాంటి నిబంధ‌న‌ల‌తో ప్ర‌పంచ‌దేశాలు వైర‌స్‌ను నియంత్రిస్తున్నాయి. కోవిడ్‌19 నుంచి తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లిగించే ప‌లు ర‌కాల ఔష‌ధాలు కూడా మార్కెట్లోకి వ‌చ్చాయి. కానీ వైర‌స్ కేసులు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.

Related Posts