YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి

అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి

అనంతపురం, జూలై 2, అనంతపురం జిల్లాలో 99 నూతన 108, 104 అంబులెన్సులను రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖా మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. గురువారం ఉదయం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సమీపంలోని రాంనగర్ బ్రిడ్జి వద్ద జిల్లాకు కేటాయించిన 99 నూతన 108, 104 అంబులెన్సులను అనంతపురం, హిందూపురం ఎంపీ లు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్,  ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం , మడకశిర ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, జాయింట్ కలెక్టర్లు (ఆర్ బి కె అండ్ ఆర్ మరియు  గ్రామ వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి ) నిశాంత్ కుమార్, డాక్టర్ ఏ సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి సూర్య లతో కలిసి మంత్రి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అత్యవసర వైద్య సేవల కల్పనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సువర్ణాధ్యాయాన్ని లిఖించారన్నారు . నిన్నటి రోజున విజయవాడ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా 1088 అత్యంత అధునాతన సంచార వైద్యశాలలు ,అంబులెన్స్ లైన 104 మరియు 108 వాహనాలను జెండా ఊపి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, విలువైన వారి ప్రాణాలను కాపాడేందుకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 108, 104 వాహనాల ద్వారా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్య సేవలు అందేలా చేశారన్నారు. ఆరోగ్యశ్రీ ని అమలు చేసి ఎంతోమంది నిరుపేదలకు శస్త్ర చికిత్సలు ఉచితంగా అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 108 వాహనానికి అత్యవసరమై ప్రజలు ఫోన్ చేస్తే గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, 104 వాహనాలను సైతం మూల పడేసి పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ కనపరచలేదన్నారు. ఇకపై ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే 108 అంబులెన్స్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

Related Posts