విజయవాడ జులై 02, కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు అదృశ్యం అయని ఘటన కలకలం రేపింది. వారం అయినా ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వసంతరావు అదృశ్యం అయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వసంతరావు భార్య ధనలక్ష్మి మాట్లాడుతూ నాభర్త కు బాగా ఆయాసం రావడంతో ప్రైవేటు ఆస్పత్రి కి వెళ్లాం. కోవిడ్ లక్షణాలు ఉన్నాయని.. ప్రభుత్వ ఆసుపత్రి కి పంపారు. జూన్ 24వ తేదీన ఆస్పత్రి కి వెళ్లగా... చాలా సేపు సిబ్బంది స్పందించ లేదు. చివరికి అందరనీ అడిగాక, వీల్ చైర్ మీద లోపలకు పంపారు. పల్స్ పడిపోతున్నాయని. ఆక్సిజన్ పెట్టాలని చెప్పారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు అక్కడే ఉన్న నన్ను ఇంటికి పంపేశారు. 25వ తేదీన ఆస్పత్రి కి వెళితే నా భర్త కనిపించడం లేదని చెప్పారు. నాలుగు రోజులు అయినా ఆచూకీ దొరకలేదు.. అధికారులు వెతికిస్తామని చెబుతూనే ఉన్నారని చెప్పింది. భర్త ఇంతవరకు ఏమయ్యారో తెలియడం లేదు. ఆస్పత్రి అధికారులు సరిగా స్పందించడం లేదు.. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకొంటోంది.