YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఇసుక డిపో ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఇసుక డిపో ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జూన్ 02, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్ సమీపంలో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపో ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ పరిశీలించారు. ఇసుక అవసరమున్న జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మీ సేవ కేంద్రాల, ఆన్లైన్ ద్వారా ట్రాక్టర్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుని అనంతరం ట్రాక్టర్ ఇసుక కోసం 4400 రూపాయలు చెల్లించాలని  సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నెంబర్లు 9491478962, 8106678940 లను సంప్రదించాలని సూచించారు. దళారులను ఆశ్రయించవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ డి ఓ నరేందర్, మైన్స్ ఏడి రాంబాబు, టీఎస్ ఎం డి ఎల్ ప్రాజెక్ట్ అధికారి  రామకృష్ణ పాల్గొన్నారు.

Related Posts