నిజామాబాద్ జూన్ 02 ఇరు రాష్ట్రాల జలవనరుల అధికారుల సమక్షంలో శ్రీరాంఆసాగర్ ప్రాజెక్ట్ లోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసారు. ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర లో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రకారం ప్రతి జులై ఒకటిన గేట్లు ఎత్తి, అక్టోబర్ నెలాఖరున మూసివేస్తారు. మహారాష్ట్రలో కురిసే వర్షలతోనే ఎస్సారెస్పీ నిండుతుండడంతో గోదావరి వరదను ఆపకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులను అనుగుణంగా ప్రతియేటా ఎస్సారెస్పీ ఈఈ, నాందేడ్ ఈఈ, జలవనరుల సంఘం ఈఈల సమక్షంలో గేట్లు ఎత్తారు. బాబ్లీ గేట్లు ఎత్తిడంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులకు పుష్కలంగా నీరు చేరడంతో వరినాట్లు వేసుకొని మురిసిపోతారు అక్టోబర్ నెలాఖరువరకు బాబ్లీ గేట్లు ఓపెన్ ఉంటాయని అధికారులు అంటున్నారు..సుప్రీంకోర్టు అదేశలనుసారం ప్రతియెట నీటిని శ్రీరాంసాగర్ లోకి విడుదల చేస్తారు.