YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ప్రైవేట్ రంగం ఉద్యోగులకు ఆర్థిక సాయం అందించాలి

ప్రైవేట్ రంగం ఉద్యోగులకు ఆర్థిక సాయం అందించాలి




జగిత్యాల  జూలై 2   ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ ప్రైవేట్ రంగం, వివిధ సంస్థలు, విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఏ3 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు.  గురువారం ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జీవన్ రెడ్డి లేఖ రాశారు.  ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా  విద్యారంగంలో పాఠశాల నుంచి కళాశాలలు, సాంకేతిక కళాశాలలతోపాటు ఇతరత్రా సేవలందిస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి వేరే ఇతర పనులు లేకపోవడం, కరోనా వ్యాధి మూలంగా  మార్చి 23 నుంచి లాక్ డౌన్ తో విద్యాలయాలు మూసి ఉంచడంతో యాజమాన్యాలు జీతాలు చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు.  దీంతో వారు ఏఇతర కార్యక్రమాల్లో పాల్గొనే వీలులేక , యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో నెలసరి జీతాలతో ఆధారపడుతున్న ఆఉద్యోగులు  ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
విద్యా సంవత్సరం వాయిదావేయగా విద్యాలయాల్లో విద్యార్థుల చేరిక ప్రక్రియ చేపట్టకపోవడం తో యాజమాన్యాలు వీరికి చెల్లించడానికి అశక్తత వ్యక్తంచేయగా ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయంఅందించుట బాధ్యతగా భావించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి అమలు చేయాలని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్ కు వ్రాసిన లేఖలో కోరారు.

Related Posts