YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుఖోయ్...యుద్ధ విమానాలకు లైన్ క్లియర్

సుఖోయ్...యుద్ధ విమానాలకు లైన్ క్లియర్

సుఖోయ్...యుద్ధ విమానాలకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ, 
భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 21 మిగ్‌-29 యుద్ధ విమానాలతో పాటు 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకరణకు డీఏసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో పాటు 12 ఎస్‌యూ-30 ఎంకేఐల కొనుగోలుకూ పచ్చజెండా ఊపింది. రష్యా నుంచి ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలు, ఆధునీకరణకు 7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా,10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్‌ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది.యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని చాలాకాలంగా భారత వాయుసేన (ఐఏఎఫ్‌) కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో 38,900 కోట్ల విలువైన ఆయుధసామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. వీటిలో 31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి సమీకరిస్తారు.చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, భారత్‌ సాయుధ సంపత్తిని మరింత బలపరుచుకుంటోంది. రూ.38,900 కోట్ల విలువైన యుద్ధవిమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధా ల కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం పచ్చజెండా ఊపింది. వీటిలో రూ.31,130 కోట్ల విలువైన కొనుగోళ్లు భారత పరిశ్రమలకే కేటాయించడం గమనార్హం. స్వదేశీ సాంకేతికతతో రూపకల్పనకు రక్షణశాఖ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి 21 మిగ్‌-29 యుద్ధవిమానాలు, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) నుంచి 12 సు-30 ఎంకేఐ యుద్ధవిమానాల్ని కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఉన్న 59 మిగ్‌-29 విమానాల్ని ఆధునికీకరించేందుకు ప్రత్యేక ప్రతిపాదనను ఆమోదించింది.రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన రక్షణ సముపార్జన మండలి (డీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు. 1000 కిలోమీటర్ల పరిధి కలిగిన దీర్ఘశ్రేణి ఉపరితల దాడి క్షిపణులు, ‘అస్త్ర’ క్షిపణుల్ని నావికాదళం, వాయుసేన కోసం రక్షణ శాఖ సమీకరిస్తోంది. ఇక.. సరిహద్దు పరిస్థితుల్లో ఏ మార్పూ రాకపోవడంతో.. ప్రత్యేక బలగాలను భారత్‌ లద్దాఖ్‌ సరిహద్దులకు తరలించింది. చైనా రెచ్చగొడితే ఏం చేయాలనేదానిపై సైనికులందరికీ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) సాంకేతికతను దేశీయ సంస్థలకు బదిలీ చేయడం వలనే ఈ కొనుగోళ్లు సాధ్యమయ్యాయని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అస్త్ర క్షిపణులు, పీనాక ఆయుధ సామగ్రి, ఉపరితల దాడి చేయగల క్షిపణుల్ని అత్యున్నత సామర్థ్యం కలిగినవిగా డీఆర్‌డీఓ చైర్మన్‌ జి. సతీష్‌ రెడ్డి అభివర్ణించారు. యుద్ధవిమానాలను పెంచాలంటూ భారత వైమానిక దళం చాలాకాలంగా చేస్తున్న విజ్ఞప్తికి సమాధానమే తాజాగా డీఏసీ ఆమోదించిన యుద్ధవిమానాలు. రష్యా నుంచి మొత్తం 21 మిగ్‌-29 మిమానాలు రానున్నాయి. 1970లో సోవియట్లు అభివృద్ధిపరచిన ఈ విమాన శ్రేణి.. అప్పటి నుంచి పలుమార్లు అప్‌గ్రేడ్‌ అవుతూ వస్తోంది. 

Related Posts