YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

హైద్రాబాద్ లో హైరానా

హైద్రాబాద్ లో హైరానా

హైద్రాబాద్ లో హైరానా
హైద్రాబాద్, 
హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి మామూలుగా లేదు. ఇప్పటికే హైదరాబాద్ లో కేసులు పదివేలు దాటడంతో ప్రభుత్వంలోనూ ఆందోళన మొదలయింది. ప్రయివేటు ఆసుపత్రులు కరోనాను సొమ్ము చేసుకుంటున్నాయి. తెలంగాణలో రోజు నమోదయ్యే కేసుల్లో 90 శాతం హైదరాబాద్ నగరంలోనే ఉండటం ప్రమాదానికి సూచికలుగా చెప్పుకోవాలి. ఇలాగే కొనసాగితే త్వరలోనే హైదరాబాద్ లో కేసులు యాభైవేలు మించుతాయంటున్నారు నిపుణులు.హైదరాబాద్ లోనే ఎక్కువగా కరోనా వ్యాప్తి జరుగుతుంది. దీనిపై కేంద్ర బృందం కూడా అధ్యయనం చేసింది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది ఉపాధి పైన ఆధారపడటం, విధుల కోసం రోడ్లమీదకు రావడంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. మరణించిన వారిలో కూడా హైదరాబాద్ వాసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కల్గించే అంశంగానే చెప్పుకోవాలి.వారు వీరనేది లేదు. ఐపీఎస్ ల నుంచి సాధారణ ఉద్యోగి వరకూ హైదరాబాద్ లో కరోనా బారిన పడుతున్నారు. అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా రద్దీ పెరిగింది. మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు తగినన్న బెడ్స్ కూడా ఆసుపత్రుల్లో లేకపోవడం. ఏ ఆసుపత్రికి వెళ్లినా బెడ్స్ ఖాళీ లేదనే సమాధానం వస్తుంది. కరోనా లక్షణాలున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా వైద్యుల హోం క్వారంటైన్ కు సిఫార్సు చేస్తున్నారు.ఇలా ఉండగా హైదరాబాద్ లో సుమారు 1500 పడకలు మాత్రమే ఉన్నాయి. 460 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. గాంధీ, ఛాతి ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రి, ఉస్మానియా వంటి ఆసుపత్రుల్లో పడకలన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. దీంతో ఆసుపత్రుల్లో కొత్త కేసులను అడ్మిట్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయివేటు ఆసుపత్రులకు కొందరు వెళ్లక తప్పని పరిస్థితి. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో కరోనా విలయతాండవం చేస్తుందని చెప్పక తప్పదు. కరోనాకు భయపడి కొందరు వ్యాపారులు ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను ప్రకటిస్తున్నారు.

Related Posts