YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

పాపాగ్ని సర్ఫేస్ డ్యామ్ ను పరిశీలించిన మంత్రులు

పాపాగ్ని సర్ఫేస్ డ్యామ్ ను పరిశీలించిన మంత్రులు

దేశంలోనే తొలిసారిగా ఆధునిక పరిజ్ఞానం తో ఆనకట్ట  నిర్మాణం జరిగింది. కడప జిల్లాలోని మూడు మండలాల్లో దాదాపు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం నాడు కడప జిల్లా వేంపల్లె మండలంలోని పాపాఘ్నినదిలో షీట్ ఫైల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన భూగర్భ ఆనకట్ట ను మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి., ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బిటెక్ రవి, ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఇతరులు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు  నిర్మాణానికి 6 కోట్ల 25 లక్షలు ఖర్చయింది. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో ఏవిధంగా అభివృద్ధి పనులు చేస్తున్నమొ అదే విధంగా పులివెందులలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. కడపజిల్లా అభివృద్ధికి మేమే దశా.. దిశా. చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల ప్రాంతం కృష్ణమ్మ జలాలతో పొంగిపొర్లుతోందని ప్రతి ఆయకట్టుకు నీరందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై దేవినేని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏనాడైనా నీ సొంత నియోజకవర్గంలోని పాపాగ్ని నదిలో సర్ఫేస్ డ్యాం కట్టాలని అనుకున్నావా అని అన్నారు . జగన్మోహన్ రెడ్డికి పదవుల వ్యామోహమే తప్ప పులివెందుల ప్రాంత ప్రజల అభివృద్ధి తెలియదని అన్నారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో రాజశేఖరరెడ్డి కుటుంబం ఏనాడైనా పులివెందులకు నీరు ఇవ్వాలని అనుకున్నారా అని ప్రశ్నించారు.. చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పం కంటే ముందే పులివెందులకు 4 ఏళ్లలో నీరు అందించాం అని అన్నారు. ఇక్కడి రైతుల కళ్ళలో ఆనందం తొనికిసలాడుతోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాసి పేట్టుకో 2019 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలో గేలవ బోతున్నామని  ఉమా అన్నారు. 

Related Posts