YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

1000 కోట్లతో  జూరాలకు కుడి, ఎడమ ప్రాజెక్టులు..?

1000 కోట్లతో  జూరాలకు కుడి, ఎడమ ప్రాజెక్టులు..?

1000 కోట్లతో  జూరాలకు కుడి, ఎడమ ప్రాజెక్టులు..?
మహబూబ్ నగర్, 
కృష్ణానదీ వరద జలాలను ఒడిసి పట్టి ప్రతినీటి చుక్కను వినియోగించుకునే విధంగా జూరాలకు కుడి, ఎ డమ వైపు ప్రాజెక్టులను నిర్మించాల ని నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్లు రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రధానంగా జూరాల కుడివైపు 20 టిఎంసిల సామర్థంతో కొత్తజలాశయాన్ని నిర్మించాలని విశ్రాంత ఇం జనీర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేసి ప్రతిపాదనలు రూపొందించారు. వ రదవచ్చినప్పుడు ఒకటిఎంసి నీటిని ఎత్తిపోసి విద్యుత్ ఉత్పాదన చేసే వి ధంగా ఈ ప్రాజెక్టు రూపొందించా రు.సుమారు వేయి కోట్ల రూపాయ ల అంచనాతో రూపొందించిన ఈ ప్రాజెక్టును పరిశీలనలో ఉంది. కృష్ణానదికి భారీగా వరదల ఉవచ్చినప్పుడు ఆనీటిని ఒడిసిపట్టే విధంగా ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరదలకు తగ్గట్టుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. జూరాలకు ఎగువన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో జలాశయ నిర్మాణాన్ని పరిశీలించాల్సిందిగా రిటైర్డ్ ఇంజనీర్లు రూపొందించిన ప్రతిపాదనలను ఇటీవల సిఎం కెసిఆర్‌కు సమర్పించగా నిపుణులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.నాగర్‌దొడ్డి, నెట్టెంపాడు, గార్లపాడు, ద్యాగదొడ్డి, గ్రామాల సమీపంలో దాదాపు 3వేల ఎకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్ నిర్మిస్తే వరదకాలంలో 20 టిఎంసి నీటిని ఒడిసిపట్టే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టుకు నాలుగు భారీ మోటార్లను బిగిస్తే ఎత్తిపోతలు తేలికవుతుందని రిటైర్డ్ ఇంజినీర్లు భావిస్తున్నారు. సముద్రమట్టానికి 370 మీటర్ల ఎత్తులో ఈ నిర్మాణం చేపట్టి 10 కిలో మీటర్ల పొడువునా కట్ట నిర్మించాలనిగతంలో 90 రోజుల వరదనీటికోసం రూపొందించిన ప్రాజెక్టులు ప్రస్తుతం వరదల తాకిడికి తట్టుకోలేక పోతున్నాయని నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధానకార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రస్తుత కాలంలో 90 రోజులు వరదలు వచ్చే అవకాశాలు కూడా లేవన్నారు. 90 రోజుల నుంచి 30 రోజుల వరదనీటిని ఒడిసి పట్టేవిధంగా ప్రస్తుతం ప్రాజెక్టుల డిజైన్లు అవసరమని ఆయన చెప్పారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న జూరాలకు డివైపు ప్రాజెక్టును నిర్మిస్తే కృష్ణనీరు సముద్రంలో కలిసే బదులు ప్రాజెక్టులోకి చేరుకుంటుందని చెప్పారు. అలాగే కోయిల్ సాగర్ దగ్గర జూరాలకు ఎడమవైపు మరో ప్రాజెక్టును నిర్మిస్తే కృష్ణావరదనీరు ఒడిసిపట్టే అవకాశాలు సంపూర్ణంగా ఉంటాయని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టులపై ప్రభుత్వం సమగ్రనివేదిక రూపొందించి పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తోందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Related Posts