YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

సింగరేణిలో రెండవరోజు సమ్మె

సింగరేణిలో రెండవరోజు సమ్మె

సింగరేణిలో రెండవరోజు సమ్మె
కొత్తగూడెం 
కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ ల ప్రైవేటికరణ కు వ్యతిరేకంగా జాతీయ సంఘాలు చేస్తున్న  సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం లో రెండో రోజు కు చేరుకుంది. మొదటి రోజు సమ్మెకు గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మద్దత్తు తెలపడంతో సమ్మె విజయవంతం అయింది. కానీ శుక్రవారం రెండో రోజు సమ్మెలో గుర్తింపు సంఘం అయినా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పాల్గొనకపోవడంతో కొద్ది మంది కార్మికులు విధులకు హాజరు కావడంతో సమ్మె పాక్షికంగా కొనసాగుతుంది. గుర్తింపు సంఘానికి చేందిన కార్మికులు విధులకు హాజరు కావడటంతో జాతీయ కార్మిక సంఘాల నాయకులకు గుర్తింపు సంఘాల నాయకుల మద్య స్వల్ప ఉదృక్తి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భూగర్భ గనుల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాజమాన్యం ముందు జాగ్రత్తగా పోలీసులను మరియు ఎస్.అండ్ పి.సి. ల సహాయం తో భూగర్భ గనుల లోకి కార్మికులు వెళ్ళేందుకు గట్టి చర్యలు చేపట్టింది సింగరేణి యాజమాన్యం. ఈ సందర్భంగా జాతీయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలవల్లా సింగరేణి మనుగడ దెబ్బ తినే ప్రమాదం ఉందని.. కార్మికుల హక్కులకై పోరాటం చేస్తూ కార్మికుల పక్షాన పోరాటం చేయాల్సిన గుర్తింపు సంఘం నాయకులు కార్మికులు విధులకు హాజరు కావటం మంచి పరిణామం కాదని ఇప్పటికైనా సింగరేణి గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ కార్మిక సంఘం కార్మికుల నిజమైన హక్కుల కోసం పోరాడుతున్న జాతీయ సంఘాలతో కలిసి  శనివారం జరగనున్న సమ్మె లో నైనా మాతో కలిసి కార్మికుల తరుపున పోరాటం చేయాలని వారు అన్నారు

Related Posts