ఇంద్రకీలాద్రిలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు
విజయవాడ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం నుంచి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. మూడు రోజుల పాటు శాకంబరీ దేవిగా భక్తులకు జగన్మాత కనకదుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో రోజుకి 6 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. తలనీలాలు సమర్పించేందుకు కూడా శుక్రవారం నుంచి కేశఖండనశాలను ప్రారంభించారు. శాకంబరీదేవి ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో ఎం.వి.సురేష్ బాబు పరిశీలించారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం మాస్క్లు ధరించిన భక్తులకు మాత్రమే క్యూ మార్గంలో అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. రోజుకి 6 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసారు.