ముంబై: ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోంది. మోదీ,అమిత్ షా ధ్వయం పైన నాగ్ పూర్ ఆగ్రహంగా ఉంది. సంఘ్ మౌలిక సూత్రాలకు భిన్నంగా ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు వ్యవహారిస్తుండటం ఆర్ఎస్ ఎస్ నేతలకు మింగుడుపడటం లేదు. తమ ఆదేశాలను పట్టించుకోకుండా మోదీ ఏకపక్షంగా వ్యవహారిస్తుండటంతో ఢిల్లీ, నాగ్ పూర్ మధ్య గ్యాప్ పెరిగిపోతోంది.కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదీ అయిన నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత తన స్వభావాన్ని నెమ్మదిగా మార్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఆయన రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తో కలిసి మోదీ ఇతర పార్టీలను కబలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘ్ స్వభావాన్ని పట్టించుకోకుండా ఫక్తు రాజకీయ వ్యూహాలతో మోదీ, అమిత్ షా ధ్వయం వ్యవహారిస్తున్నారు. కాంగ్రెస్ హఠావో అంటు వీరిద్దరు ఇచ్చిన నినాదాన్ని ఆర్ఎస్ ఎస్ తప్పుపడుతోంది. హఠావో అన్న పదం వాడటం సరైనది కాదని సంఘ్ చెపుతోంది. దేశంలో దళితుల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆర్ఎస్ ఎస్ ఛీప్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. స్వతంత్ర భారతంలో ఎవరూ హింసాయుత సంఘటనలకు పాల్పడవద్దని సూచించారు. ఇదే సమయంలో సత్యాగ్రహం కూడా సరైన విధానం కాదని భగవత్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాల వైఖరీకి నిరసగా ప్రధాని మోదీ హుబ్లీలో ఒక రోజు దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. సత్యాగ్రహం ద్వారా నిరసన తెలిపే ప్రక్రియ అవసరం లేదని అంబేద్కర్ వ్యాఖ్యానించినట్లు భగవత్ గుర్తు చేశారు.