సికింద్రాబాద్ జూలై 3, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం కంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. నగరంలో కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించి కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు. వర్షాకాలం ప్రభావంతో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా అనేది నూటికి 70 శాతం అందరిలో వచ్చి వెళ్తుందని లక్షణాలు లేకుండానే కరోనా ఉధృతి కొనసాగుతోందని ఆయన అన్నారు. కరోనా వస్తే చనిపోతామని భయాందోళనలు ప్రజలు వీడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కరోనా బారిన పడి ప్రజా ప్రతినిధులు కూడా కోరుకుంటున్నారని అన్నారు. కరుణ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ప్రైవేటు ఆసుపత్రులలో పరిస్థితి దయనీయంగా తయారైందని,ప్రైవేటు ఆసుపత్రుల్లో దోచుకోవడానికే తప్ప బాధ్యతాయుతంగా పని చేయట్లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా అతలాకుతలం అయిందని వైరస్ విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్ప వేరే దారి లేదు అని ఆయన అన్నారు.