అమరావతి జూలై 3, ఏపీలో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 16,934కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. ఏపీలో కరోనాతో ఇప్పటివరకు 206 మంది మృతి చెందారు. 9,096 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో7,632 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 38,898 మందికి కరోనా పరీక్షలు జరిపారు.